Health Care

అక్కడ ఉద్యోగులకు ఆ కారణానికి కూడా సెలవులు ఇస్తున్నారు.. అదేంటో తెలిస్తే షాకవ్వాల్సిందే..


దిశ, ఫీచర్స్: మనం పని చేస్తున్న కంపెనీలలో వారంలో ఒక రోజు సెలవు తీసుకోవడం ఉద్యోగుల హక్కు అన్న విషయం మనందరికి తెలిసిందే. అనారోగ్యంతో బాధ పడుతున్న వారికి, వివిధ కారణాల వల్ల కంపెనీలు తమ ఉద్యోగులకు రెండు లేక ఒక రోజు సెలవు మంజూరు చేస్తాయి. అయితే ఈ కంపెనీ మాత్రం అన్ని కంపెనీల కన్నా భిన్నంగా ఆలోచించి.. ఎవరూ ఊహించలేని కారణానికి కూడా తమ ఉద్యోగులకు సెలవులు ఇస్తున్నాయి. అదేంటో ఇక్కడ తెలుసుకుందాం..

సాధారణంగా లీవ్స్‌లో సిక్స్‌ లీవ్స్‌, క్యాజువల్‌ లీవ్స్‌ వంటివి ఉంటాయి. అయితే, ప్రేమ జీవితం విఫలమైనా సెలవులు ఇస్తారని ఎక్కడైనా విన్నారా? అవును మీరు చదువుతున్నది నిజమే భారతదేశపు ప్రముఖ ఫిన్‌టెక్ కంపెనీ స్టాక్‌గ్రో తమ ఉద్యోగులకు ఇటువంటి సెలవులను అందిస్తుంది. బ్రేక్‌ప్‌ లీవ్స్‌ పేరుతో సెలవుగా మంజూరు చేస్తున్నారు. క్లిష్ట సమయంలో ప్రేమలో విడిపోయిన ఉద్యోగులకు మద్దతుగా స్టాక్‌గ్రో ఈ సెలవు విధానాన్ని ప్రవేశపెట్టింది.

ఉద్యోగులు బ్రేక్ అప్ పేరుతొ సెలవు తీసుకుంటే, కంపెనీ ఎటువంటి ప్రశ్నలను అడగదు. ఈ సెలవును ఉద్యోగి సద్వినియోగం చేసుకోవాలనుకుంటే, మేనేజ్‌మెంట్‌తో నేరుగా సంప్రదించి పొందవచ్చు. ఉద్యోగులకు ఈ లీవ్ మనశ్శాంతిని ఇస్తుందని, వారు తిరిగి వచ్చి మెరుగైన పని చేస్తారని కంపెనీ తెలిపింది.



Source link

Related posts

ఆ రాశులవారు తమ భావొద్వేగాలను ఎప్పటికీ బయట పెట్టరు.. మీ రాశి కూడా ఇదేనా?

Oknews

షుగర్ కంట్రోల్ చేస్తున్న దాల్చిన చెక్క

Oknews

మీన రాశిలో త్రిగ్రాహి యోగం.. ఈ రాశుల వారికి డబ్బే డబ్బు

Oknews

Leave a Comment