EntertainmentLatest News

కొత్త సినిమాలో రతికరోజ్…


 

చిన్న సెలబ్రిటీ స్థాయిలో ఉన్నవారికి పెద్ద సినిమా అవకాశం వచ్చిందంటే వారి లైఫ్ మలుపు తిరిగినట్టే.. ఇప్పుడు అదే జరిగింది. బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో ఎంట్రీ ఇచ్చి పాపులారిటీ తెచ్చుకున్న రతికరోజ్ కి ఓ సినిమాలో అవకాశంలో వచ్చింది.

ఆ సినిమా ఓపెనింగ్ సెర్మనీ కి సంబంధించిన ఓ షార్ట్ వీడియోని తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది రతికరోజ్. అది ఇప్పుడు వైరల్ గా మారింది. ఆ మూవీ కబుర్లేంటో ఓసారి చూసేద్దాం.. పిజ్జా 4 : హోమ్ ఎలోన్ అనే సినినాలో రతికరోజ్ ఓ పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాకి దర్శకుడిగా ఆండ్రూస్ చేస్తుండగా.. సీవీ కుమార్ ప్రొడ్యూసర్ గా ఉన్నాడు. తంగం సినిమా బ్యానర్ లో ఈ చిత్రాన్ని తెరకిక్కిస్తున్నారు. రతికరోజ్ బిగ్ బాస్ హౌజ్ లోకి టైటిల్ ఫేవరెట్ గా ఎంట్రీ ఇచ్చింది. అయితే తను పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్ లతో కలిసి ప్రేక్షకులకు ‘బేబీ’ సిమిమాని చూపించిన విషయం తెలిసిందే. అయితే రతిక కంటెంట్ కోసం మాట్లాడే విధానం, తన మాటలని తనే ఫ్లిప్ చేయడం, అక్కడివి ఇక్కడ, ఇక్కడవి అక్కడ చెప్పడంతో తనని రతిక బదులు రాధిక అని నెటిజన్లు ట్రోల్స్ చేసిన విషయం తెలిసిందే. 


బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చాక సెలబ్రిటీ హోదా దక్కుతుందేమో కానీ బయటకొచ్చాక అవకాశాలు మాత్రం తక్కువే వస్తాయి. ఎందుకంటే హౌజ్ లో ఎవరేంటనేది  అందరు చూసేస్తారు.‌ ఇక బయటకొచ్చాక వాళ్ళు సినిమాల్లో పాజిటివ్ రోల్స్ చేసిన నెగెటివ్ రోల్స్ చేసినా.. అంతంతమాత్రమే గుర్తింపు వస్తుంది. మరి కొత్త సినిమాలో అవకాశం వచ్చిన రతికరోజ్ కి ఈ పిజ్జా4  సినిమా సక్సెస్ ఇస్తుందో లేదో చూడాలి. మరి బిగ్ బాస్ లో రతికరోజ్ ఎలా ఉంది? బయట ఎలా ఉంది.. మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. 

 



Source link

Related posts

Samantha is ready.. సమంత సిద్దమే.. మరి మీరూ..!!

Oknews

చంద్రబాబు పాత్రలో మహేష్

Oknews

Again Movie in Nani and Srikanth Odela Combo నాని-శ్రీకాంత్: దసరా కి సీక్వెల్ కాదా?

Oknews

Leave a Comment