ప్రతిపక్షల నేతల ఫోన్లు ట్యాపింగ్ఎస్ఐబీ(SIB) మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఆదేశాలతో ఫోన్ ట్యాపింగ్(Phone Tapping Case) వ్యవహారం అంతా జరిగినట్లు ప్రణీత్ రావు తన వాంగ్మూలంలో తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కోసం కన్వర్జెన్స్ ఇన్నోవేషన్ ల్యాబ్ టూల్స్ వాడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ల్యాబ్ డైరెక్టర్లు పాల్ రవికుమార్, బూసి , శ్రీవల్లిని విచారించే అవకాశం ఉందని సమాచారం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎన్నికలు, ఉపఎన్నికల్లో ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాపింగ్ కు పాల్పడినట్లు ఇప్పటికే ఈ కేసులో అరెస్టైన నిందితులు వాంగ్మూలం ఇచ్చారు.
Source link