Health Care

మెదడు చురుగ్గా పనిచేయాలా? ఈ మైండ్ బూస్టింగ్ టెక్నిక్స్ పాటిస్తే చాలు..


దిశ, ఫీచర్స్ : మనం ఏ పనిచేయాలన్నా అందుకు సంసిద్ధత ముఖ్యం. కానీ కొన్ని సందర్భాల్లో మనసు, శరీరం అందుకు అందుకు సహకరించవు. మెదడు మొద్దుబారిపోయినట్లు అనిపిస్తుంది. ఏ పని చేయాలన్నా ఏకాగ్రత కుదరకపోవడం, ఆసక్తి తగ్గడం వంటి ఇబ్బందులు తలెత్తుతుంటాయి. అయితే కొన్ని రకాల అలవాట్లు కూడా ఇందుకు కారణం అవుతాయని, మైండ్‌ను సూపర్‌ ఛార్జ్ చేసే కొన్ని టెక్నిక్స్ పాటించడంవల్ల ఇబ్బందులను నివారించవచ్చని నిపుణులు అంటున్నారు. మెదుడు చురుగ్గా పనిచేసేందుకు ఏం చేయాలో సూచిస్తున్నారు.

* క్వాలిటీ స్లీప్ : ప్రతి రోజూ ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోవడంవల్ల మైండ్ రిలాక్స్ అవుతుంది. మెదడును సూపర్ ఛార్జ్ చేయడానికి క్వాలిటీ స్లీప్ చాలా ముఖ్యం. అందుకోసం

*ప్రోటీన్లు : దీర్ఘకాలంపాటు పోషకాహారం తీసుకోకపోతే కూడా మీ మైండ్ సక్రమంగా పనిచేయదు. అందుకే ప్రోటీన్లు, కార్బొ హైడ్రేట్లు, సీజనల్ ఫ్రూట్స్‌ తీసుకుంటూ ఉండాలి. అన్ని రకాల కూరగాయలు, మాంసం వంటివి తీసుకోవడం వల్ల సమతుల్య పోషకాలు లభిస్తాయి. ఇవి మెదడుకు సరైన పోషణ అందించడంవల్ల మీరు ఏ విషయంలో అయినా చురుగ్గా పని చేయగలుగుతారు.

* ప్రకృతిలో గడపడం : ప్రకృతిని ఆస్వాదించడం, పచ్చని చెట్ల మధ్య కాసేపు గడపడం మానసిక ఆనందాన్ని ఇస్తుంది. తద్వారా మెదడు కూడా చురుగ్గా పనిచేస్తుంది.

* స్మార్ట్ ఫోన్ పక్కన పెట్టండి : రోజూ రకరకాల పని ఒత్తిళ్లతో అలసిపోయినప్పుడు తదేకంగా స్మార్ట్ ఫోన్ చూడడం, వివిధ స్ర్కీన్లు చూడటం మరింత అలసటకు దారితీస్తుంది. దీంతో మెదడు చురుకుగా పనిచేయదు. కాబట్టి మెదడుకు సూపర్ ఛార్జ్ అందించాలంటే రిలాక్స్ అయ్యే వరకైనా ఫోన్ చూడటం ఆపి వేయాలి.

* కృతజ్ఞతా భావం : మనం అనేక విషయాల్లో కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండటం అనేది మానసిక సంతృప్తిని ఇస్తుంది. దీనివల్ల మెదుడు యాక్టివ్‌గా పనిచేయడం ప్రారంభిస్తుంది. అందుకే మీకు సహాయం చేసిన వ్యక్తులను, మిమ్మల్ని వివిధ సందర్భాల్లో ప్రోత్సహిస్తూ సపోర్టుగా నిలిచేవారిని, మీ గురించి కేర్ తీసుకుంటున్న కుటుంబ సభ్యులను ఒకసారి గుర్తు చేసుకోండి. అప్పుడు సహజంగానే మీలో కృతజ్ఞతా భావం ఏర్పడుతుంది. ఇది మీలో చురుకుదనాన్ని పెంచుతుంది.



Source link

Related posts

మీరు కొనే పుచ్చకాయ మంచిదేనా.. రంగు, రుచిని ఇలా గుర్తించండి?

Oknews

రాంలాల్లా విగ్రహం నలుపు రంగులో ఎందుకు ఉంటుంది.. నల్లని విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చా ?

Oknews

శరీరంలో ఈ లక్షణాలు ప్రమాదకరం.. ఏం చేయాలంటే..

Oknews

Leave a Comment