Sports

Justin Langer snubs Viv Richards and Sachin Tendulkar as he picks Virat Kohli as the best player


Justin Langer picks Virat Kohli as the best player: లక్నో సూపర్‌ జెయింట్స్‌(LSG) హెడ్‌ కోచ్‌.. ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు జస్టిన్ లాంగర్(Justin Langer) కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ ఏడాది సీజన్‌తో లక్నో హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన లాంగర్‌.. తాజాగా లక్నో సూపర్‌ జెయింట్స్‌ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ క్రమంలో తన లైఫ్‌లో చూసిన అద్బుతమైన క్రికెటర్ల గురించి ప్రస్తావించాడు. ఇప్పటివరకు తన జీవితంలో చూసిన ఉత్తమ ఆటగాడు విరాట్‌ కోహ్లీనే అని లాంగ్‌ తేల్చి చెప్పాడు. లెజండరీ క్రికెటర్లు వివ్ రిచర్డ్స్, అలన్ బోర్డర్‌, మార్టిన్ క్రోవ్‌లు అంటే కూడా ఇష్టమన్నాడు.  బ్రియాన్ లారా, సచిన్ టెండూల్కర్‌ కూడా గొప్ప ఆటగాళ్లని… కానీ విరాట్‌ ఎనర్జీ వీరిందరి కంటే అద్భుతమని ప్రశంసల వర్షం కురిపించాడు. కోహ్లీ చాలా ఫిట్‌గా ఉన్నాడు. విరాట్‌ మైదానంలో వికెట్ల మధ్య పరిగెత్తడం, ఫీల్డింగ్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటాడన్నాడు. కాబట్టి కోహ్లీ ఆట చూడటం తనకు చాలా ఇష్టమని లాంగర్‌ అన్నాడు. 

పేస్‌ స్టార్‌గా మయాంక్‌ 
కళ్ళు అటు తిప్పి ఇటు తిరిగే లోపే బాల్ దూసుకెళ్లింది. అరంగేట్రం మ్యాచ్‌లోనే గంటకు 156 కిలోమీటర్ల వేగంతో బంతిని సంధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. నయా సంచలనం మయాంక్ యాదవ్‌ . లకడగా 150+ కి.మీ వేగంతో బంతులేస్తూ స్టార్‌ క్రికెటర్లనే ఆశ్చర్యపరిచాడు. తాజాగా గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో మయాంక్‌ కేవలం ఒక్క ఓవర్‌ మాత్రమే బౌలింగ్‌ చేసి మైదానాన్ని వీడాడు. అయితే అతడికి ఏమైందనే ప్రశ్నలు తలెత్తాయని దీనిపై లక్నో సీఈవో స్పందించారు. 

లక్నో సీఈవో ఏమన్నాడంటే..?
 పేస్‌ స్టార్‌ మయాంక్‌ యాదవ్‌ గాయంపై లక్నో సూపర్ జెయింట్స్ సీఈఓ వినోద్ బిష్త్ కీలక ప్రకటన చేశారు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మయాంక్ గాయపడ్డాడు, మయాంక్ యాదవ్ మొదటి  ఓవర్‌లో 13 పరుగులు ఇచ్చాడు. తర్వాత మైదానం నుంచి వెళ్లిపోయాడు. ఈ పరిస్థితుల్లో మయాంక్‌ ఫిట్‌నెస్‌పై ప్రశ్నలు తలెత్తాయి. “మయాంక్ యాదవ్ పొత్తికడుపులో కాస్త నొప్పితో బాధపడుతున్నాడు. ఆ సమస్య తీవ్రం కాకుండా ఉండేందుకే గుజరాత్‌ మ్యాచ్‌లో మైదానాన్నీ వీడాడు. మయాంక్ త్వరలో మైదానంలోకి వస్తాడని ఆశిస్తున్నాం” అని లక్నో సూపర్ జెయింట్స్ సీఈఓ వినోద్ బిష్త్ ప్రకటించారు. మయాంక్ యాదవ్ ఇప్పటివరకు 3 మ్యాచ్‌లలో 6 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ 2024లో లక్నో సూపర్ జెయింట్ ఇప్పటి వరకు 4 మ్యాచ్‌లు ఆడింది. తొలి మ్యాచ్‌లో ఓడిపోయినా, ఆ తర్వాత హ్యాట్రిక్ విజయాలు సాధించింది. లక్నో తర్వాతి మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్‌తో  ఏప్రిల్ 12న ఎకానా స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్‌లో మయాంక్‌ బరిలోకి దిగుతాడా లేదా అన్నదానిపై స్పష్టత లేదు.

కృనాల్‌ చెప్పినా..
గుజరాత్‌పై విజయం అనంతరం లక్నో సూపర్ జెయింట్స్ సీనియర్ ప్లేయర్ కృనాల్ పాండ్యా మయాంక్ యాదవ్ గాయంపై స్పందించాడు. అతనికి సీరియస్ ఇంజ్యూరీ ఏం కాలేదని తెలిపాడు. ‘మయాంక్ యాదవ్ బాగానే ఉన్నాడు. అతని ఎలాంటి సీరియస్ ఇంజ్యూరీ కాలేదు. గత రెండేళ్లుగా అతన్ని నేను దగ్గరగా చూస్తున్నాను. బౌలింగ్ గన్‌లా అతను నెట్స్‌లో బౌలింగ్ చేసేవాడు. అతనికి మంచి బలం ఉంది.’అని చెప్పుకొచ్చాడు. సీరియస్ ఇంజ్యూరీ కాదని కృనాల్ పాండ్యా చెబుతున్నా.. మయాంక్ యాదవ్ మరో రెండు మ్యాచ్‌ల వరకు దూరమయ్యే అవకాశం ఉంది.

మరిన్ని చూడండి



Source link

Related posts

LSG vs DC IPL 2024 Head to Head records

Oknews

India Vs Bangladesh Highlights U19 World Cup 2024 India Crush Bangladesh By 84 Runs

Oknews

Nita Ambani Smriti Mandhana MI vs RCB: ఎలిమినేటర్ ముగిసిన తర్వాత నీతా, స్మృతి మంధాన పాత ఫొటో వైరల్

Oknews

Leave a Comment