నాడు పెద్దపల్లి…నేడు కరీంనగర్ లోగతంలో రేషన్ బియ్యం రీసైక్లింగ్(Rice Recycling Scam) దందా పెద్దపల్లి జిల్లాలో జరిగింది. అదే విధంగా ప్రస్తుతం కరీంనగర్ జిల్లా(Karimnagar)లో జరుగుతున్నట్లు తాజా సంఘటన రుజువు చేస్తుంది. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే పదుల సంఖ్యలో అధికారులు కేసులు నమోదు చేసిన అక్రమ దందా ఆగడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా రైస్ మిల్లు వద్ద పట్టుబడ్డ రేషన్ బియ్యం(Ration Rice)పై లోతైన విచారణలో టాస్క్ ఫోర్స్ పోలీసులు నిమగ్నమయ్యారు. ఏ విషయం బయటకు పోకుండా రహస్యంగా విచారణ కొనసాగిస్తున్నారు. ఈ దందా వెనుక ఎవరున్నారు?..అధికారుల పాత్ర ఏంటి?.. సంబంధిత శాఖలు ఏం చేస్తున్నాయి?..అనే అంశాలపై ఆరా తీస్తున్నారు.
Source link
previous post