Health Care

పిల్లల్లో ఎగ్జామ్స్ ప్రెజర్ ఎక్కువగా ఉంటుందా? ఈ ఫుడ్ ఇస్తే ఉత్సాహంగా ఉంటారు…


దిశ, ఫీచర్స్:స్కూల్‌లో ఫైనల్ ఎగ్జామ్స్ స్టార్ట్ కాబోతున్నాయి. పిల్లలు ఇప్పటికే ప్రిపరేషన్ మొదలుపెట్టినా.. ఆ చిట్టి బ్రెయిన్స్ పరీక్షలంటే ఒత్తిడిని ఎదుర్కొంటాయి. ఎలా రాస్తామోననే టెన్షన్‌తో సతమతం అవుతుంటాయి. అలా కాకుండా ఉండాలంటే వారి డైట్‌లో ఈ ఫుడ్ ఐటెమ్స్ చేర్చమని సలహా ఇస్తున్నారు నిపుణులు. వీటి ద్వారా బ్రెయిన్ మెమొరీ పెరగడంతోపాటు స్ట్రెస్ రిలీఫ్ ఉంటుందని చెప్తున్నారు.

1.వాల్ నట్స్

వాల్‌నట్స్ పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారంగా చెప్పబడుతున్నాయి. రుచిని ప్రేరేపించడం, దీర్ఘకాలిక వ్యాధులను నివారించడంతోపాటు మెదడు అభివృద్ధిని ప్రోత్సహించే వాల్ నట్స్‌ను పిల్లల‌ రోజువారీ ఆహారంలో చేర్చాలని సూచిస్తున్నారు ఎక్స్‌పర్ట్స్. ఒత్తిడి తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తున్నాయని వివరిస్తున్నా

2. ఎగ్స్

గుడ్లు అయోడిన్, ఐరన్, రిచ్ ప్రోటీన్, ఒమేగా-3 ఫ్యాట్స్, విటమిన్లు A, D, E మరియు B12ని అందిస్తాయి. అధిక-ప్రోటీన్ అల్పాహారంగా తీసుకోవడం మూలంగా పిల్లలు కడుపు నిండినట్లు అనుభూతి చెందడంతోపాటు రోజంతా అదే శక్తిని మెయింటెన్ చేస్తారు. చదువుపై కాన్సంట్రేట్ చేసేందుకు కూడా హెల్ప్ అవుతుంది ఎగ్.

3. చేపలు

చేపల్లో ఉండే ఒమేగా 3, జింక్ బ్రెయిన్ ఫంక్షన్‌‌ను ఇంప్రూవ్ చేస్తుంది. స్ట్రెస్ రిలీవింగ్‌కు హెల్ప్ అవుతుంది. ముఖ్యంగా సాల్మన్, ట్రౌట్, హెర్రింగ్‌లలో మెమొరీని పెంచే DHA ఎక్కువగా ఉంటుంది. రొయ్యలు, కాడ్, క్యాట్ ఫిష్, క్రాబ్, స్కాలోప్స్, పొల్లాక్, టిలాపియా, వైట్ ఫిష్, ట్రౌట్, పెర్చ్, ఫ్లౌండర్, సోల్, సార్డైన్, ఆంకోవీ, క్రాఫిష్, క్లామ్స్, ఓస్టెర్, ఎండ్రకాయలు కూడా బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పబడుతున్నాయి.

4. పాలకూర

ఎదిగే పిల్లలకు పాలకూర ఖచ్చితంగా ఇవ్వాలని సూచిస్తారు హెల్త్ ఎక్స్‌పర్ట్స్. రిచ్ న్యూట్రిషనల్ ఫుడ్‌గా చెప్పబడే ఈ ఆకు కూర.. బాడీలో స్ట్రెస్ రిమూవ్ చేసే గ్లూకోజినోలేట్స్ కలిగి ఉంది. అందుకే ఎగ్జామ్స్ టైమ్‌లో కిడ్స్ డైట్‌లో చేర్చాలని చెప్తున్నారు.

5. సిట్రస్ ఫ్రూట్స్

సిట్రస్ ఫ్రూట్స్ బ్రెయిన్‌ను యాక్టివ్‌గా ఉంచేందుకు సహాయపడుతాయి. ముఖ్యంగా ఆరెంజ్, నిమ్మకాయలో ఉండే విటమిన్ సి మెమొరీని ఇంక్రీజ్ చేయడంలో కీ రోల్ ప్లే చేస్తాయి.



Source link

Related posts

బాల రాముని మూడో విగ్రహం లుక్ రివీల్.. దీనిని ఎక్కడ ఉంచుతారంటే.

Oknews

ఉమెన్స్ డే స్పెషల్ : ప్రతి మహిళ తప్పనిసరిగా చేయించుకోవలసిన ఆరోగ్య పరీక్షలు ఇవే!

Oknews

జుట్టుకి రంగేసే వాళ్లు.. వీటి గురించి తప్పక తెలుసుకోవాలి!

Oknews

Leave a Comment