దిశ, ఫీచర్స్ : ప్రేమలో పడితే చాలు మండు వేసవి కూడా నిండు పున్నమిలా అనిపిస్తుంది అన్నాడో భావ కవి. ఫీలింగ్స్ వరకైతే సమ్మగానే ఉంటుంది. కానీ ఆచరణలో మాత్రం అందుకు భిన్నమైన అనుభవాలే చాలా మందికి ఎదురవుతుంటాయని పెద్దలు, నిపుణులు కూడా చెప్తుంటారు. అలాగని ఇక్కడ ప్రేమను తక్కువ చేసి చూడటమో, తప్పుడు అంచనా వేయడమో కాదు కానీ, ఏది ప్రేమ, ఏది అట్రాక్షన్, జీవితంలో దాని ప్రయారిటీ ఏంటి? అనే విషయాల్లో సరైన డెసిషన్ తీసుకోవడంలో మాత్రం తప్పటడుగులు వేసేవారు చాలా మందే ఉంటున్నారని నిపుణులు చెప్తున్న మాట.
తప్పుడు నిర్ణయాలకు ప్రేరణ
బయటకు చెప్పుకోకపోవచ్చు. కానీ సమాజంలో చాలా మంది ఎదుర్కొనే అంతర్గత మానసిక సంఘర్షణలు చాలానే ఉంటున్నాయి. ముఖ్యంగా లవ్, రిలేషన్‌షిప్, లైఫ్ పార్టనర్‌ను ఎంచుకోవడం వంటి నిర్ణయాలు తీసుకోవడంలో చాలామంది తప్పటడుగులు వేస్తుంటారని, అతర్వాత రియలైజ్ అయినా ఏమీ చేయలేక అడ్జస్ట్ అవుతుంటారని అమెరికన్ సైకాలజీ అసోసియేషన్‌కు చెందిన కీలక వ్యక్తుల్లో ఒకరైన డేవిడ్ విల్సన్ అంటున్నారు.
కీలకపాత్ర పోషిస్తున్న మెదడు
ఒక వ్యక్తి ప్రేమలో పడటానికి శారీరక మార్పులు, మానసిక, సామాజిక, కుటుంబ పరిస్థితులు కూడా కారణం అవుతుంటాయి. మెదడు కూడా ఇక్కడ కీల పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే ఇది అట్రాక్షన్, హ్యాపీనెస్‌లకు కారణం అయ్యే డొపమైన్, సెరోటోనిన్ వంటి హార్మోన్లను రిలీజ్ చేస్తుంది. దీంతోపాటు వ్యక్తులు సహజంగానే భద్రత, కన్‌ఫర్టబుల్, ఎమోషనల్ సపోర్ట్ అందించే వ్యక్తిని భాగస్వామిగా పొందాలని కూడా ఆలోచిస్తారు. ఈ అవసరాలు బలంగా ఉండి, సరైన పర్సన్ కాకపోయినప్పటికీ వారితో రిలేషన్ పెట్టుకునేలా సదరు వ్యక్తులను ప్రేరేపిస్తాయి.
వాస్తవాలు గ్రహించలేక..
తరచుగా సమస్యల్లో చిక్కుకుపోతుండటం, ఆత్మ విశ్వాసం తక్కువగా ఉండటం వంటివి కూడా తప్పుడు వ్యక్తితో ప్రేమలో పడటానికి, భాగస్వామిగా ఎంచుకోవడానికి ప్రేరణగా నిలుస్తుంటాయని సైకియాట్రిస్టులు, సెక్సువల్ హెల్త్‌ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. అయితే ఇక్కడ వాస్తవాలను, పార్టనర్‌లో లోపాలను ముందుగానే గ్రహించకపోవడం అనేది అకస్మాత్తుగా జరిగిపోతూ ఉంటుంది. ఆ తర్వాత రియలైజ్ అయినప్పటికీ, కుటుంబ, సామాజిక అవసరాలు, కారణాలు, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు పరిస్థితిని బట్టి సర్దుకుపోయేలా చేస్తాయి. ఇక అడ్జస్ట్ కాలేనివారు విడిపోవడం, మరొక భాగస్వామిని ఎంచుకోవడం వంటివి చేస్తుంటారు.