EntertainmentLatest News

అన్ స్టాఫుబుల్ సీజన్ 4 లో ట్విస్ట్.. ఏం పర్లేదు బాలయ్య అభిమానులు హ్యాపీగా ఉండండి


 

అనుకున్నదొక్కటి అయినదొక్కటి అనే పాట ఇప్పుడు నందమూరి ఫ్యాన్స్ కి పర్ఫెక్ట్ గా సూటవ్వుతుంది.వాళ్ళు ఈ ఉగాదికి ఒకటి అనుకున్నారు. అది జరగలేదు. కానీ వాళ్ళ సంతోషం విషయంలో మాత్రం ఎలాంటి బ్రేక్ రాలేదు. ఒక రకంగా వాళ్ళు అనుకున్న దానికి మించే జరిగిందని చెప్పవచ్చు. ఇంతకీ వాళ్ళు ఏమనుకున్నారు?  ఏమి జరిగింది? 

తెలుగు ప్రజలతో పాటు బాలకృష్ణ( balakrishna)అభిమానులు కూడా ఈ ఉగాదిని చాలా ఘనంగా జరుపుకున్నారు. అంతకంటే ముందు   బాలయ్య నయా మూవీ టైటిల్ అనౌన్స్ మెంట్ పండుగ రోజు వస్తుందని ఫ్యాన్స్ ఎదురుచూసారు. ఎందుకంటే కొన్ని రోజుల  నుంచి సోషల్ మీడియాలో టైటిల్ ప్రకటన వస్తుందనే ప్రచారం వచ్చింది.పైగా  బాలయ్య సినిమా టైటిల్స్ చాలా పవర్ ఫుల్ గా ఉండి  సినిమా రిలీజ్ అయ్యే  దాకా ఫ్యాన్స్  కాలర్ ఎగరేసుకొని తిరిగేలా చేస్తాయి. దాంతో టైటిల్ ప్రకటన కోసం ఎదురు చూసారు. కానీ ఆ ప్లేస్ లో ఇంకో గుడ్ న్యూస్ మాత్రం వాళ్ళు విన్నారు. అదేంటంటే  అన్ స్టాఫుబుల్ సీజన్ 4   

 

అన్ స్టాఫుబుల్ సీజన్ 4( Unstoppable season 4) త్వరలోనే రాబోతుంది  ఈ విషయాన్ని ఆహా యాజమాన్యం  ఒక పోస్టర్ ద్వారా వెల్లడి చేసింది. దీంతో బాలయ్య అభిమానుల్లో టైటిల్ విషయాన్ని మర్చిపోయేలా చేసి డబుల్ ఉగాదిని తీసుకొచ్చింది. అన్ స్టాఫుబుల్  షో  2021 లో స్టార్ట్ అయ్యింది. ఈ షో  ద్వారా ఒక సరికొత్త బాలయ్య ప్రేక్షకులకి పరిచయమయ్యాడు.సినీ రాజకీయ రంగంలోని వాళ్ళని బాలయ్య ఇంటర్వ్యూ చేసే విధానానికి ప్రతి ఒక్కళ్ళు ఫిదా అవుతున్నారు. చాలా మంది ఈ షో ద్వారా కూడా ఆయనకీ  అభిమానులుగా మారిపోయారు.పైగా ఈ  షో ఇండియాలోనే నెంబర్ వన్ షో టాక్ షో గా ఉందంటే అది కేవలం బాలయ్య వల్లనే. పోస్టర్ లో ఆహా యాజమాన్యం విత్  ఏ ట్విస్ట్ అని చెప్పడంతో అందరిలో ఆ ట్విస్ట్ ఏంటనే క్యూరియాసిటీ ఏర్పడింది.

 



Source link

Related posts

అరుదైన వ్యాధితో బాధపడుతున్న పూనమ్ కౌర్

Oknews

‘దేవర’ డేట్ కి వస్తున్న రవితేజ..!

Oknews

విజయ్, రష్మిక ఎంగేజ్‏మెంట్ డేట్ ఫిక్స్!

Oknews

Leave a Comment