EntertainmentLatest News

ఇప్పటికైనా ఏదో ఒక అప్‌డేట్‌ ఇవ్వండి సామీ… ‘కల్కి’ మేకర్స్‌పై ఫైర్‌ అవుతున్న ఫ్యాన్స్‌!


ఒక స్టార్‌ హీరో సినిమా రాబోతోంది అంటే ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉంటాయో, సినిమాపై ఎలాంటి క్యూరియాసిటీ ఉంటుందో తెలిసిందే. సినిమాకి సంబంధించిన అప్‌డేట్స్‌ కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. కానీ, పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ హీరోగా, నాగ్‌ అశ్విన్‌ డైరెక్షన్‌లో రూపొందుతున్న ‘కల్కి 2898ఎడి’ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్స్‌ కరవయ్యాయి. వైజయంతి మూవీస్‌ సంస్థ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. వైజయంతి మూవీస్‌కి సెంటిమెంట్‌ డేట్‌ అయిన మే 9న చిత్రాన్ని రిలీజ్‌ చేస్తామని గతంలో ప్రకటించారు. అదేరోజు దేశంలో ఎలక్షన్స్‌ జరగనుండడంతో ముందుగా ఎనౌన్స్‌ చేసిన డేట్‌కి సినిమా రిలీజ్‌ కావడం లేదని, వాయిదా పడిరదనే వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంలో మేకర్స్‌ స్పందించాల్సిన అవసరం ఉంది. సినిమాని ఎప్పుడు రిలీజ్‌ చేస్తారు అనే విషయంలో అఫీషియల్‌గా క్లారిటీ ఇవ్వాలి. కానీ, మేకర్స్‌ సైడ్‌ అలాంటి ప్రయత్నాలేవీ కనిపించడం లేదు. దీంతో ‘కల్కి’ రిలీజ్‌ డేట్‌ విషయంలో సోషల్‌ మీడియాలో రకరకాల కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. ‘ఏయ్‌ బాబూ లేవ్‌.. కల్కి అప్‌డేట్‌ ఇవ్వు’ అంటూ నెటిజన్లు, ఫ్యాన్స్‌ ఫన్నీగా కామెంట్స్‌ పెడుతున్నారు. 

సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ‘కల్కి’ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, దీపిక పదుకొణె, దిశా పటాని, రాజేంద్ర ప్రసాద్‌  వంటి మహామహులు నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ కోసం ఇటీవల ఇటలీ వెళ్ళింది టీమ్‌. అయితే సినిమాకి సంబంధించి అసలు ఏం జరుగుతోంది అనే విషయంలో అందరూ అయోమయంగా ఎదురుచూస్తున్నారు. ముందుగా అనుకున్న ప్రకారం అయితే సినిమా రిలీజ్‌కి ఇంకా నెలరోజులు మాత్రమే టైమ్‌ ఉంది. కానీ, సినిమా ఇంకా నిర్మాణ దశలోనే ఉంది. ఈ చిత్రాన్ని మే 30న విడుదల చేసే అవకాశం ఉంది అనే మాట కూడా వినిపిస్తోంది. ఇదే విషయాన్ని అధికారికంగా ఎందుకు ప్రకటించడం లేదు అని ప్రభాస్‌ ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. ఒక స్టార్‌ హీరో సినిమా.. అందులోనూ భారీ బడ్జెట్‌ మూవీ అంటే షూటింగ్‌కిగానీ, పోస్ట్‌ ప్రొడక్షన్‌కి గానీ చాలా ఎక్కువ టైమ్‌ పడుతుంది. ముందుగా ప్రకటించిన విధంగా సినిమాను రిలీజ్‌ చేయలేకపోవచ్చు. అదే విషయం గురించి అందరికీ క్లారిటీ ఇస్తే బాగుంటుంది అనేది నెటిజన్ల అభిప్రాయం. 

మరోపక్క మే ఎండిరగ్‌ కాదు, సినిమా ఇంకా వెనక్కి వెళ్ళే అవకాశం ఉందనే మాట కూడా వినిపిస్తోంది. ఉగాదికి ‘కల్కి’ చిత్రానికి సంబంధించిన ఏదో ఒక అప్‌డేట్‌ ఇస్తారని అంతా భావించారు. అలాంటిదేమీ జరక్కపోవడంతో సినిమా రిలీజ్‌ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందనే వాదన బలపడుతోంది. మరి ఈ విషయంలో మేకర్స్‌ ఎలా స్పందిస్తారో, ఎలాంటి ప్రకటన చేస్తారో తెలియాలంటే కొన్నిరోజులు వెయిట్‌ చెయ్యక తప్పదు. 



Source link

Related posts

ఓటీటీలో 'పిండం' సినిమాకు సూపర్ రెస్పాన్స్!

Oknews

రామ్ గోపాల్ వర్మ కళ్ళు చాలా ఇష్టం.. హైదరాబాద్ లో కలుస్తాను

Oknews

Rashi Khanna new look in pink outfit పింక్ అవుట్ ఫిట్ లో రాశి ఖన్నా

Oknews

Leave a Comment