Andhra Pradesh

నెల్లూరులో తీవ్ర విషాదం, కూల్ డ్రింక్ అనుకుని పెట్రోల్ తాగిన బాలుడు మృతి!-nellore crime news in telugu toddler drinks petrol thinks cool drinks died ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


అసలేం జరిగింది?

నెల్లూరు(Nellore) నగరంలోని ఇరుగాళమ్మ కట్టకు చెందిన షేక్ కరిముల్లా, అమ్ము భార్యాభర్తలు. వీరికి ఇద్దరు సంతానం. షేక్ కరిముల్లా స్థానికంగా చికెన్ షాపు నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అమ్ములు చేపల దుకాణంలో పనిచేస్తుంది. ఇద్దరు పిల్లలతో హాయిగా జీవిస్తుండగా అనుకోని ఘటన వీరి కుటుంబాన్ని విషాదంలో ముంచింది. ఈ నెల 7న అమ్ము ఇరుగాళమ్మ ఆలయం వద్ద పనిచేస్తుండగా…రెండేళ్ల కాలేషా అక్కడే ఆడుకుంటున్నాడు. ఆడుకుంటూ అక్కడ ఒక బాటిల్ లో ఉన్న పెట్రోల్(Petrol) చూసిన కాలేషా కూల్ డ్రింక్(Cool Drink) అనుకుని తాగేశాడు. అనంతరం బాలుడు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అయితే కాస్త ఆలస్యంగా బాలుడ్ని గమనించిన తల్లి..చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలుడు కాలేషా మృతి చెందాడు. బాలుడి తల్లిదండ్రులు ఫిర్యాదుతో చిన్నబజారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలుడి మరణంతో స్థానికంగా విషాదం నెలకొంది.



Source link

Related posts

జ‌గ‌న్ పై రాళ్ల‌ దాడి.. కంటికి గాయం!

Oknews

AP TET DSC 2024 : గడువు సమీపించింది..! పెండింగ్ లోనే ఏపీ టెట్ ఫలితాలు, డీఎస్సీ పరీక్షలపై వీడని సందిగ్ధత..!

Oknews

Opinion: ప్రజాగళం’ అమలే కూటమికి అగ్నిపరీక్ష!

Oknews

Leave a Comment