నాకు మార్కులు వేయకపోతే చేతబడి చేయిస్తా
పదో తరగతి(AP 10th Exam) జవాబు పత్రాలను బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో మూల్యాంకనం చేస్తు్న్నారు. తెలుగు పేపర్ (Telugu Paper)లో రామాయణం(Ramayana) ప్రాశస్త్యం గురించి వివరించండి అనే ప్రశ్నకు ఓ విద్యార్థి… అందుకు సమాధానం రాయకుండా… ‘నాకు మార్కులు వేయకపోతే మా తాత చేత చేతబడి చేయిస్తా’ అని రాశాడు. ఈ సమాధానం చూసి అవాక్కైన ఉపాధ్యాయుడు జవాబు పత్రాన్ని పై అధికారులకు చూపించారు. అయితే ఆ విద్యార్థికి తెలుగులో వందకు 70 మార్కులు రావడం గమనార్హం. మరో విద్యార్థి రామాయణంలో పాత్ర స్వభావం గురించి రాయమంటే ‘మంధర శివాజీ మహారాజును తీసుకుని దండకారణ్యానికి వెళ్లింది’ అని రాశాడు. ఇలాంటి వింత సమాధానాలు చూసి ఉపాధ్యాయులు విస్తుపోతున్నారు.