ByGanesh
Thu 11th Apr 2024 05:40 PM
యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర షూటింగ్ కి చిన్న బ్రేకిచ్చి ముంబై లో కాలు పెట్టారు. ఈరోజు గురువారం బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఎన్టీఆర్ ముంబై బయలుదేరి వెళ్ళారు. ముంబైలో జరుగుతున్న వార్ 2 సెట్స్ లోకి ఎన్టీఆర్ ఎంటర్ అయిన వీడియోస్, ఎయిర్ పోర్ట్ వీడియోస్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవడం అటుంచి.. ఎన్టీఆర్ కి ముంబై లో స్పెషల్ వెల్ కమ్ లభించింది.
అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో హృతిక్ రోషన్ హీరోగా తెరకెక్కనున్న వార్ 2 లో ఎన్టీఆర్ కీలక పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే. యష్ రాజ్ ఫిలిమ్స్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న వార్ 2 షూటింగ్ రీసెంట్ గానే ప్రారంభమవగా.. ఎన్టీఆర్ నేటి నుంచి షూటింగ్ లో పాల్గొనేందుకు ముంబై వెళ్లారు. ఈ చిత్రంలో కియారా అద్వానీ, శార్వరి హీరోయిన్స్ గా నటిస్తుండగా.. జాన్ అబ్రహం విలన్ రోల్ పోషిస్తున్నారు.
వార్ 2 మొదలైనప్పుడే ఈ చిత్రం 2025 ఆగష్టు 14 న విడుదల అని అనౌన్సమెంట్ కూడా వచ్చేసింది. ఇక ఎన్టీఆర్ వార్ 2 కోసం స్పెషల్ మేకోవర్ అయ్యాడా అనేలా ఆయన న్యూ లుక్ ఉంది. తలకి క్యాప్ పెట్టుకుని కనిపించినా ఎన్టీఆర్ కొత్త లుక్ మాత్రం ఎన్టీఆర్ ఫాన్స్ కి ఫుల్ కిక్ ఇచ్చింది. వార్ 2 లో ఎన్టీఆర్ ఇండియన్ రా ఏజెంట్ పాత్రలో కనిపిస్తారు, అందుకోసం యష్ రాజ్ ఫిలిమ్స్ వారు ఓ స్పెషల్ ట్రైనర్ ని ఎన్టీఆర్ కోసం పురమాయించారనే ప్రచారం కూడా ఉంది.
ఇక ఎన్టీఆర్ వార్ 2 షూటింగ్ కోసం ఓ పది రోజులు ముంబైలోనే ఉండబోతున్నారు. ఆతర్వాత ఆయన మళ్ళీ దేవర షూటింగ్ సెట్స్ కి వచ్చేస్తారని.. దేవర షూటింగ్ కంప్లీట్ చేశాకే.. మళ్ళీ వార్ 2 కి డేట్లు కేటాయిస్తారని తెలుస్తోంది.
War2: Young Tiger NTR stylish look wows:
NTR stylish look from War 2