Sports

MI vs RCB IPL 2024 Preview and Prediction


MI vs RCB IPL 2024 Preview and Prediction : ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(IPL)లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(RCB).. అగ్ని పరీక్షకు సిద్ధమైంది. ఈ ఐపీఎల్‌లో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్‌(MI)తో బెంగళూరు అమీతుమీ తేల్చుకోనుంది. ప్లే ఆఫ్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే బెంగళూరుకు ఈ మ్యాచ్‌లో విజయం తప్పనిసరి. ముంబై ఇండియన్స్‌ కూడా వరుసగా విఫలమవుతున్నా గత మ్యాచ్‌లో విజయం సాధించి ఈ ఐపీఎల్‌లో తొలి విజయం నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లపై తీవ్ర ఒత్తిడి ఉంది. బెంగళూరు ఈ ఐపీఎల్‌లో ఇప్పటివరకూ అయిదు మ్యాచులు ఆడగా కేవలం ఒకే విజయం నమోదు చేసింది. పాయింట్ల పట్టికలో ముంబై తర్వాతి స్థానంలో ఉన్న బెంగళూరు ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ప్లే ఆఫ్‌ రేసులో నిలవాలని పట్టుదలగా ఉంది. దాదాపుగా ముంబై కూడా అదే స్థితిలో ఉంది. ముంబై ఆడిన నాలుగు మ్యాచుల్లో ఒక్క విజయం మాత్రమే సాధించింది. గత మ్యాచ్‌లో ఢిల్లీపై 29 పరుగుల తేడాతో ముంబై గెలిచింది. 

విరాట్‌ ఒక్కడేనా..?
 బెంగళూరు జట్టులో విరాట్ కోహ్లి ఒక్కడే భారాన్ని మోస్తున్నాడు. ఈ ఐపీఎల్‌లో తొలి శతకం నమోదు చేసి మంచి ఫామ్‌లో ఉన్న కోహ్లీకి ఇతర బ్యాటర్ల నుంచి మద్దతు కరువవుతోంది. RCB నాకౌట్‌ చేరాలంటే ఇక్కడి నుంచి ప్రతీ మ్యాచ్‌ కీలకం కావడంతో మిగిలిన బ్యాటర్లు కూడా జూలు విధించాల్సి ఉంది. ఐపీఎల్‌లో తొలి దశ మ్యాచులో ముగుస్తున్నా బెంగళూరు బ్యాటర్లు పూర్తిగా గాడిన పడలేదు. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ (109 పరుగులు), గ్లెన్ మాక్స్‌వెల్ (32), కామెరాన్ గ్రీన్ (68)లతో ఇప్పటివరకూ దారుణాంగా విఫలమయ్యారు. కోహ్లి మాత్రం భీకర ఫామ్‌లో ఉన్నాడు. 146.29 స్ట్రైక్ రేట్‌తో ఒక సెంచరీ, రెండు అర్ధసెంచరీలతో కోహ్లీ 316 పరుగులు చేశాడు. ఐదు నెలల క్రితం వాంఖడే స్టేడియంలో జరిగిన ప్రపంచకప్ సెమీఫైనల్‌లో తన 50వ వన్డే సెంచరీ చేసిన తర్వాత కోహ్లీ మరోసారి ఈ మైదానంలో బరిలోకి దిగుతున్నాడు. తనకు 50 వ సెంచరీ మధుర జ్ఞాపకాలను ఇచ్చిన వాంఖడేలో మళ్లీ విజృంభించాలని కోహ్లీ గట్టి పట్టుదలతో ఉన్నాడు. బెంగళూరు బౌలింగ్‌ పేలవంగా ఉండడం.. ప్రత్యర్థి జట్లకు కలసి వస్తోంది. మాక్స్‌వెల్ మినహా మిగిలిన బౌలర్లు అంతగా ప్రభావం చూపలేకపోతున్నారు. ముంబైతో ఆడిన గత అయిదు మ్యాచుల్లో బెంగళూరు నాలుగు గెలిచింది. ఇది ఆర్సీబీ ఆత్మ విశ్వాసాన్ని పెంచుతోంది. 

ముంబైకి విజయం అవసరమే
ముంబైకు ఈ మ్యాచు చాలా కీలకంగా మారింది. ప్రస్తుత పరిస్థితులు ముంబైకే అనుకూలంగా ఉన్నాయి. ఈ ఐపీఎల్‌లో తొలి విజయాన్ని నమోదు చేసిన ముంబై దాన్ని కొనసాగించాలని పట్టుదలగా ఉంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్‌ను ఎదుర్కోవడానికి ముందు తడబడుతున్న RCBపై గెలిచి ఆత్మ విశ్వాసాన్ని పోగు చేసుకోవాలని ముంబై చూస్తోంది. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ రాణిస్తున్నా మిడిల్‌ ఆర్డర్‌లో ముంబై బ్యాటర్లు మెరవడం లేదు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా నుంచి భారీ ఇన్నింగ్స్‌ ఇంకా బాకీగానే ఉంది. గాయం తర్వాత జట్టులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ తొలి మ్యాచ్‌లో నిరాశపరిచాడు. రొమారియో షెపర్డ్ ఒక ఓవర్‌లో 32 పరుగులు చేసి తాను ఎంత విధ్వంసకర బ్యాటర్‌నో ఇప్పటికే ప్రత్యర్థి జట్లకు తేల్చి చెప్పాడు. సూర్య, షెపర్డ్‌ బ్యాట్‌కు పని చెప్తే బెంగళూరుపై గెలుపు ముంబైకి కష్టమేమీ కాదు.
జట్లు:
ముంబై ఇండియన్స్: హార్దిక్ పాండ్యా (కెప్టెన్‌), రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, డెవాల్డ్ బ్రీవిస్, జస్ప్రీత్ బుమ్రా, పియూష్ చావ్లా, గెరాల్డ్ కోయెట్జీ, టిమ్ డేవిడ్, శ్రేయస్ గోపాల్, ఇషాన్ కిషన్, అన్షుల్ కాంబోజ్, కుమార్ కార్తికేయ, ఆకాష్ మద్వాల్, క్వేనా మఫాక , మహ్మద్ నబీ, షామ్స్ ములానీ, నమన్ ధీర్, శివాలిక్ శర్మ, రొమారియో షెపర్డ్, అర్జున్ టెండూల్కర్, నువాన్ తుషార, తిలక్ వర్మ, విష్ణు వినోద్, నేహాల్ వధేరా, ల్యూక్ వుడ్. 

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్‌), గ్లెన్ మాక్స్‌వెల్, విరాట్ కోహ్లి, రజత్ పటీదార్, అనుజ్ రావత్, దినేష్ కార్తీక్, సుయాష్ ప్రభుదేసాయి, విల్ జాక్స్, మహిపాల్ లోమ్రోర్, కర్ణ్ శర్మ, మనోజ్ భాండాగే, మయాంక్ దాగర్, విజయ్‌కుమార్ దీప్, ఆకాశ్‌కుమార్, వైషక్, మహ్మద్ సిరాజ్, రీస్ టోప్లీ, హిమాన్షు శర్మ, రాజన్ కుమార్, కామెరాన్ గ్రీన్, అల్జారీ జోసెఫ్, యష్ దయాల్, టామ్ కుర్రాన్, లాకీ ఫెర్గూసన్, స్వప్నిల్ సింగ్, సౌరవ్ చౌహాన్.

మరిన్ని చూడండి



Source link

Related posts

Eng Vs SA World Cup 2023 Highlights

Oknews

BCCI Test Cricket Incentive Scheme: టెస్టు క్రికెట్ లో కూడా గట్టిగా సంపాదించొచ్చు… ఎలానో చూడండి..!

Oknews

IPL 2024 MI vs CSK Preview and Prediction

Oknews

Leave a Comment