MI vs RCB IPL 2024 Mumbai Target 197: ముంబై ఇండియన్స్(MI)తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) పోరాడే స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి 196పరుగులు చేసింది. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌పైనా బెంగళూరు బ్యాటర్లు తడబడ్డారు. బెంగళూరు సారధి ఫాఫ్ డుప్లెసిస్, రజత్ పటిదార్ అర్ధ శతకాలతో మెరిశారు. విరాట్ కోహ్లీ మరోసారి నిరాశ పరిచాడు. చివర్లో దినేశ్ కార్తీక్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ముంబై బౌలర్లలో బుమ్రా అయిదు వికెట్లు తీయగా… కోయిట్జే, మద్వాల్ గోపాల్ ఒక్కో వికెట్ తీశారు. బుమ్రా అద్భుత బౌలింగ్‌తో బెంగళూరు బ్యాటర్లను కట్టడి చేశారు. బుమ్రా నాలుగు ఓవర్లు వేసి కేవలం 18 పరుగులు ఇచ్చి అయిదు వికెట్లు తీశాడు. దినేశ్ కార్తిక్ 23 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్ లతో 53 పరుగులు చేశాడు.
డుప్లెసిస్, పటిదార్ వల్లే..
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు శుభారంభం లభించలేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న విరాట్ కోహ్లీని బుమ్రా అవుట్ చేశాడు. బుమ్రా వేసిన ఇన్‌స్వింగర్.. కోహ్లీ బ్యాట్‌ను తాకుతూ కీపర్ దగ్గరికి వెళ్లగా… ఇషాన్ కిషన్ అద్భుతంగా డైవ్ చేస్తూ క్యాచ్ అందుకున్నాడు. దీంతో 14 పరుగుల వద్ద బెంగళూరు కోహ్లీ వికెట్‌ను కోల్పోయింది. తొమ్మిది బంతులు ఎదుర్కొని కేవలం మూడే పరుగులు చేసి కోహ్లీ వెనుదిరిగాడు. కాసేపటికే విల్ జాక్స్ కూడా అవుటయ్యాడు. దీంతో బెంగళూరు 23 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కానీ ఫాఫ్ డుప్లెసిస్, రజత్ పాటిదార్ బెంగళూరును ఆదుకున్నారు. వరుసగా విఫలమవుతున్న రజత్ పాటిదార్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. డుప్లెసిస్ 40 బంతుల్లో నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లో 61 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్‌లో అవుటయ్యాడు. 26 బంతుల్లోనే మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో రజత్ పాటిదార్ 50 పరుగులు చేసి అవుటయ్యాడు. పటిదార్‌ను కోయెట్జే అవుట్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన మ్యాక్స్‌వెల్ మరోసారి నిరాశపరిచాడు. నాలుగు బంతులు ఎదుర్కొని ఒక్క పరుగు కూడా చేయకుండా అవుటయ్యాడు. తర్వాత సౌరవ్ చౌహాన్‌ను కూడా బ్రుమా అవుట్ చేశాడు. కానీ దినేశ్ కార్తీక్ బెంగళూరుకు పోరాడే స్కోరును అందించాడు. దినేశ్ కార్తిక్ 23 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్ లతో 53 పరుగులు చేశాడు. బుమ్రా అయిదు వికెట్లతో బెంగళూరు పతనాన్ని శాసించాడు.
రికార్డులు ఇలా
ఈ ఐపీఎల్‌లో ఇప్పటివరకూ 32 మ్యాచుల్లో తలపడ్డాయి. ఇందులో ముంబై 18 మ్యాచుల్లో విజయం సాధించగా…. బెంగళూరు 14 మ్యాచుల్లో విజయం సాధించింది. అన్ని మ్యాచుల్లోనూ ఫలితం వచ్చింది. ముంబైపై బెంగళూరు అత్యధిక స్కోరు 235 పరుగులు కాగా… బెంగళూరుపై ముంబై అత్యధిక స్కోరు 213 పరుగులు. బెంగళూరు అత్యల్ప స్కోరు 122 పరుగులు కాగా.. ముంబై అత్యల్ప స్కోరు 111 పరుగులు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచుల్లో విరాట్ కోహ్లీ, AB డివిలియర్స్ అద్భుత గణాంకాలు కలిగి ఉన్నారు. ముంబైపై విరాట్ కోహ్లీ ఇప్పటివరకూ 852 పరుగులు చేశాడు. ఏబీ డివిలియర్స్ 786 పరుగులు చేశాడు. ముంబై తరుపున కెప్టెన్ రోహిత్ శర్మ 793 పరుగులు, కీరన్ పొలార్డ్ 551 పరుగులు చేశారు. బౌలర్లలో ముంబై స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా 24 వికెట్లు తీయగా, యుజ్వేంద్ర చాహల్ 22 వికెట్లు తీశాడు. హర్భజన్ సింగ్ 18 వికెట్లతో తర్వాతి స్థానంలో ఉన్నాడు.
మరిన్ని చూడండి