GossipsLatest News

ఈ వారం క్రేజీ క్రేజీ ఓటీటీ చిత్రాలు


ప్రతి వారంలా కాదు.. ఈ వారం క్రేజీ క్రేజీ తెలుగు చిత్రాలు పలు ఓటీటీల నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ కి అందుబాటులోకి వచ్చేసాయి. నిన్న గురువారం రంజాన్ సందర్భంగా థియేటర్స్ లో విడుదలైన చిత్రాలు ప్రేక్షకులని ఇంప్రెస్స్ చెయ్యడంలో చేతులెత్తేశాయి. గీతాంజలి మళ్ళీ వచ్చింది, శ్రీరంగనీతులు, లవ్ గురు డబ్బింగ్ మూవీ.. ఇలా ఏది ప్రేక్షకులని ఆకట్టుకోలేకపోయాయి. 

కానీ ఈ వారం ఓటీటీలలో మాత్రం థియేటర్స్ లో హిట్ అయిన క్రేజీ మూవీస్ మూవీస్ స్ట్రీమింగ్ లోకి వచ్చాయి. 

మలయాళ డబ్బింగ్ మూవీ ప్రేమలు ఆహా ఓటీటీ నుంచి ఏప్రిల్ 12 అంటే ఈరోజు నుంచి అందుబాటులోకి వచ్చేసింది. ఈ చిత్రం మళయాళంలోనే కాదు  తెలుగులోనూ సూపర్ డూపర్ హిట్టయ్యింది. దీనిని ఓటీటీలో చూసేందుకు ఫ్యామిలీ ఆడియన్స్, యూత్ చాలా వెయిట్ చేస్తున్నారు. 

విశ్వక్ సేన్ గామీ థియేటర్స్ లో హిట్ చిత్రంగా నిలవగా అది ఇప్పుడు Zee 5 నుంచి ఏప్రిల్ 12 న అందుబాటులోకి వచ్చింది. 

శ్రీ విష్ణు-ప్రియదర్శి-రాహుల్ రామకృష్ణల ఓం భీమ్ బుష్ కూడా ఈరోజు శుక్రవారం ఏప్రిల్ 12 నుంచి అమెజాన్ ప్రైమ్ నుంచి తెలుగు ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. 

ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా YS జగన్ బయోపిక్ యాత్ర 2 కూడా ఈరోజు నుంచే అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రత్యక్షమైంది. సో ఈ వారం ఓటీటీ ప్రియులకి పండగే పండగ అన్నమాట. 





Source link

Related posts

ఫ్యామిలీతో మృణాల్ గుడి పడ్వా సెలబ్రేషన్స్

Oknews

Sammakka Saralamma Tribal museum in Medaram is dazzling It gives a glimpse of tribal way of life

Oknews

Top News From Andhra Pradesh Telangana Today 28 January 2024

Oknews

Leave a Comment