GossipsLatest News

Booming Malayalam Films మల్లువుడ్ సినిమాలు కుమ్మేస్తున్నాయి



Fri 12th Apr 2024 08:52 PM

fahad faasil  మల్లువుడ్ సినిమాలు కుమ్మేస్తున్నాయి


Booming Malayalam Films మల్లువుడ్ సినిమాలు కుమ్మేస్తున్నాయి

మలయాళంలో ఈ మద్యన విడుదలైన ప్రతి సినిమా సూపర్ హిట్టయ్యిపోతుంది. ఫిబ్రవరి, మార్చ్ ఇప్పుడు ఏప్రిల్ లో మల్లువుడ్ లో విడుదలైన సినిమాలు మొత్తం హిట్ అయ్యాయి. ఫిబ్రవరి లో ప్రేమలు, భ్రమయుగం మార్చ్ లో మంజుమ్మ‌ల్ బాయ్స్, ఇప్పుడు ఫహద్ ఫాసిల్ నటించిన ఆవేశం చిత్రం సూపర్ డూపర్ హిట్ అయ్యింది. నిన్న గురువారం రంజాన్ స్పెషల్ గా విడుదలై సూపర్ హిట్ తెచ్చుకుంది. 

అసలు ఫహద్ ఫాసిల్ ఏం హీరోరా అని అతని కెరీర్ ఆరంభంలో మాట్లాడిన వారు, ఇప్పటికి అదే అనుమానంలో ఉన్నవాళ్ళకి ఫహద్ తానేమిటో పదే పదే నిరూపిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఆవేశం చిత్రం లో ఫహద్ ఫాసిల్ మరోసారి తన మార్క్ నటనతో అభిమానులని తెగ ఇంప్రెస్స్ చెయ్యడమే కాదు, కామన్ ఆడియన్స్ చేత క్లాప్స్ కొట్టించుకుంటున్నాడు. మ‌ల‌యాళంలో రిలీజ్ అయిన ఆవేశం చిత్రం విజ‌యం సాధించింది. అంతేకాదు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు ద‌క్కించుకుంది. 

సినిమా అంతా ప‌హాద్ వ‌న్ మ్యాన్ షోగా హైలైట్ అవుతుంది. మరి మళయాళంలో బ్లాక్ బస్టర్ అయిన ప్రతి చిత్రాన్ని ఆఘమేఘాల మీద తెలుగులో విడుదల చేసేస్తున్న దర్శకనిర్మాతలు ఆవేశం చిత్రాన్ని ఎప్పుడు డబ్ చేసి వదులుతారో, ఏ నిర్మాణ సంస్థ ఫహద్ ఫాసిల్ ఆవేశం తెలుగు డబ్బింగ్ రైట్స్ దక్కించుకుంటుందో అనే క్యూరియాసిటీ ఇప్పుడు తెలుగు ఆడియన్స్ లో మొదలైంది. 


Booming Malayalam Films:

Fahad Faasil Aavesham Public talk









Source link

Related posts

Balayya-Boyapati combo muhurtham is coming బాలయ్య-బోయపాటి కాంబో ముహూర్తం వస్తోంది

Oknews

బాబాయ్ వర్సెస్ అబ్బాయ్.. హీటెక్కిస్తున్న నందమూరి వార్!

Oknews

Adilabad Aatram Sakku Face To Face: ఎంపీ ఎన్నికల్లో విజయంపై బీఆర్ఎస్ అభ్యర్థి ఆత్రం సక్కు ధీమా

Oknews

Leave a Comment