ఖమ్మంకు పాకిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతాజాగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో (TS Politics)గుబులు రేపుతున్న అంశం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. అధికార, ప్రతిపక్షాల నడుమ భగ్గుమంటున్న బర్నింగ్ ఇష్యూ ఇది. ఇందులో రాష్ట్రంలోని కీలక ఉన్నతాధికారుల పాత్ర ప్రముఖంగా తెరపైకి కనిపిస్తుండగా ఆ వెనుక రాజకీయ పెద్దల హస్తం ఎలాగు ఉందనే ఉంది. అయితే సంచలనం కలిగిస్తున్న ఫోన్ ట్యాపింగ్(Phone Tapping) మూలాలు ఖమ్మం జిల్లాలోనూ బయట పడుతున్నాయి. జిల్లాకు చెందిన నాటి బీఆర్ఎస్ కీలక నేత ఒక పోలీస్ బాస్ ను అడ్డం పెట్టుకుని ఈ ఫోన్ ట్యాపింగ్ బాగోతానికి తెర లేపినట్లు తెలుస్తోంది. జిల్లా కేంద్రంగా పోలీసు శాఖలో ఉన్నతాధికారిగా విధులు నిర్వర్తించిన బోస్ సహాయ సహకారాలతో జిల్లాలోని కొందరు కీలక నేతల ఫోన్లను ట్యాప్ చేసినట్లు గుప్పుమంటోంది. ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి మండల కేంద్రంగా ఒక వార్ రూమ్ ని ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచి తమకు కావాల్సిన వ్యక్తుల ఫోన్ నెంబర్లను ట్యాప్ చేసేందుకు పథక రచన చేసినట్లు తెలుస్తోంది. సదరు పోలీస్ అధికారి అమాత్యునితో తుదికంటా అంటగాగి చివరికి అధికారం కోల్పోయే క్రమంలో ఉద్యోగానికి స్వచ్ఛంద విరమణ ప్రకటించారు. ఆ అధికారి సాంకేతిక అండదండలతో అమాత్యుడు ఇష్టారీతిన ఫోన్ ట్యాపింగ్ లకు పాల్పడినట్లు తెలుస్తోంది.
Source link
previous post