Telangana

Telangana Teacher Eligibility Test 2024 can make changes in their application forms also through mobile edit now



TS TET Application Edit: తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టీఎస్ టెట్‌-2024 దరఖాస్తుల సవరణ ప్రక్రియ ఏప్రిల్ 11న ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే మొబైల్‌ఫోన్‌లోనూ ఎడిట్‌ చేసుకొనేందుకు విద్యాశాఖ అవకాశం కల్పించింది. ఇప్పటివరకు కేవలం కంప్యూటర్లు, డెస్క్‌టాప్‌లపైనే దరఖాస్తుల సవరణకు  వీలుండేది. కాని మొబైల్‌ఫోన్‌ ద్వారానూ అప్లికేషన్ ఎడిట్‌ చేసుకునేందుకు విద్యాశాఖ ఏర్పాటు చేసింది. అభ్యర్థులు ఏప్రిల్ 20 వరకు దరఖాస్తు వివరాల్లో తప్పులుంటే మార్చుకోవచ్చు.
TS TET 2024 దరఖాస్తుల సవరణ ఇలా…
Step 1: దరఖాస్తుల సవరణ కోసం అభ్యర్థులు మొదట అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి-https://tstet2024.aptonline.in
Step 2: అక్కడ హోంపేజీలో కనిపించే ‘Edit Application’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
Step 3: ఆ ఆప్షన్‌పై క్లిక్ చేయగానే వచ్చే కొత్తపేజీలో అభ్యర్థులు జనర్నల్ నెంబర్/పేమెంట్ రెఫరెన్స్ ఐడీ, పుట్టినతేదీ వివరాలు నమోదుచేయాలి. 
Step 4: వివరాలు నమోదుచేయగానే అభ్యర్థుల దరఖాస్తు ఫామ్ ఓపెన్ అవుతోంది. 
Step 5: దరఖాస్తు వివరాల్లో ఏమైనా పొరపాట్లు ఉంటే సరిచేసుకోవాలి.
Step 6: వివరాలు మార్చుకున్న తర్వాత ‘submit’ బటన్ మీద క్లిక్ చేయాలి.
Step 7: మరోసారి కొత్త దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకోవాలి. దరఖాస్తును ప్రింట్ తీసుకొని భవిష్యత్ అవసరాల కోసం భద్రపరచుకోవాలి.
టెట్  (TS TET – 2024)దరఖాస్తుల సవరణ కోసం క్లిక్ చేయండి..
ఏప్రిల్ 20 వరకు దరఖాస్తుకు అవకాశం..తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TS TET)- 2024 దరఖాస్తు గడువును ప్రభుత్వం పొడిగించిన సంగతి తెలిసిందే. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. ఏప్రిల్ 10తో గడువు ముగియాల్సి ఉండగా..  ఏప్రిల్ 20 వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించింది. ఏప్రిల్ 9 సాయంత్రం నాటికి కేవలం టెట్‌కు 1,93,135 లక్షల దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. ఇందులో పేపర్‌-1కు 72,771 మంది, పేపర్‌-2కు 1,20,364 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. గతంతో పోల్చితే దరఖాస్తులు భారీగా తగ్గడంతో ప్రభుత్వం గడువు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా దరఖాస్తుల్లో ఏమైనా తప్పులుంటే సరిచేసుకునేందుకు ఏప్రిల్ 11 నుంచి 20 వరకు అభ్యర్థులకు అవకాశం కల్పించింది.
అర్హతలు..➥ టెట్ పేపర్-1కి డీఈడీ అర్హత ఉండాలి. ఇంటర్‌లో జనరల్ అభ్యర్థులకు 50 శాతం, ఇతరులకు 45 శాతం మార్కులు తప్పనిసరిగా ఉండాలి.. ఒకవేళ అభ్యర్థులు 2015లోపు డీఈడీలో చేసిఉంటే జనరల్ అభ్యర్థులకుఇంటర్‌లో 45 శాతం, ఇతరులకు 40 శాతం మార్కులు ఉన్నా అర్హులే. 
➥ టెట్ పేపర్-2కి డిగ్రీ, బీఈడీ ఉండాలి. జనరల్ అభ్యర్థులకు డిగ్రీలో 50 శాతం, ఇతరులకు 45 శాతం మార్కులు ఉండాలి. 2015లోపు బీఈడీ అయితే జనరల్‌కి 50 శాతం, ఇతరులకు 40 శాతం మార్కులు ఉన్నా అర్హులే. సర్వీస్ టీచర్లు కూడా టెట్ రాయవచ్చు.
మే 20 నుంచి జూన్ 3 వరకు టెట్  పరీక్షలు..ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 20 నుంచి జూన్ 3 వరకు కంప్యూటర్ ఆధారిత విధానంలో టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను  ఏప్రిల్ 15 నుంచి అందుబాటులో ఉంచనున్నారు. ఆయాతేదీల్లో ఉదయం 9 గంటల నుంచి 11.30 వరకు పేపర్-1, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 వరకు పేపర్-2 పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష ఫలితాలను జూన్ 12న విడుదలచేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 11 జిల్లా కేంద్రాల్లో టెట్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. దరఖాస్తు సమయంలో అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే 7075701768, 7075701784 నంబర్లలో సంప్రదించవచ్చు.
పరీక్ష విధానం: టెట్ పరీక్షలకు సంబంధించి 150 మార్కులకు పేపర్-1, 150 మార్కులకు పేపర్-2 నిర్వహించనున్నారు. ఒక్కో పేపరులో 150 ప్రశ్నలు ఉంటాయి. పేపర్-1లో 5 విభాగాలు ఉంటాయి. ఒక్కో విభాగంలో 30 ప్రశ్నలు- 30 మార్కులు కేటాయించారు. ఇక పేపర్-1లో 4 విభాగాలు ఉంటాయి. వీటిలో మొదటి మూడు విభాగాల్లో 30 ప్రశ్నలు- 30 మార్కులు, నాలుగో విభాగానికి 60 ప్రశ్నలు – 60 మార్కులు కేటాయించారు. పరీక్షల్లో అర్హత మార్కులను 60 శాతం, బీసీలకు 50 శాతం, ఎస్సీ-ఎస్టీ-దివ్యాంగులకు 40 శాతంగా నిర్ణయించారు.
ముఖ్యమైన తేదీలు..
➥ టెట్-2024 నోటిఫికేషన్: 14.03.2024.
➥ టెట్-2024 ఇన్‌ఫర్మేషన్ బులిటెన్, సమగ్ర నోటిఫికేషన్: 22.03.2024.
➥ ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపు ప్రారంభం: 27.03.2024.
➥ ఆన్‌లైన్ దరఖాస్తు. ఫీజు చెల్లింపునకు చివరితేది: 10.04.2024. (20.04.2024 వరకు పొడిగించారు)
➥ హాల్‌టికెట్ల డౌన్‌లోడ్: 15.05.2024 నుంచి.
➥ టెట్-2024 పరీక్ష తేదీలు: 20.05.2024 – 03.06.2024.
➥ పరీక్ష సమయం: ఉదయం 9 గం. – 11.30 గం. వరకు, మధ్యాహ్నం 2 గం.- సాయంత్రం 4.30 వరకు.
➥ టెట్-2024 ఫలితాల వెల్లడి: 12.06.2024.
TS TET 2024 Detailed Notification
TS TET 2024 Information Bulletin
Online Application
మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..



Source link

Related posts

Weather in Telangana Andhra pradesh Hyderabad on 12 April 2024 Summer heat waves updates latest news here

Oknews

Mrunal Thakur Launched Big C Galaxy S24 | Mrunal Thakur Launched Big C Galaxy S24 : బిగ్ సీ గెలాక్సీ S24ను లాంఛ్ చేసిన మృణాల్ ఠాకూర్

Oknews

భద్రాద్రి పోలీసుల ఆపరేషన్ చేయూత సక్సెస్, మావోయిస్టు లొంగుబాటు-bhadradri police operation cheyutha success maoist party committee member surrendered ,తెలంగాణ న్యూస్

Oknews

Leave a Comment