Telangana

krishna board committe allocated drinking water from sagar to telugu states | Nagarjuna Sagar: తాగునీటి అవసరాలకు సాగర్ నుంచి కేటాయింపులు



Water Allocations From Sagar To Telugu States: నాగార్జునసాగర్ (Nagarjuna Sagar) నుంచి తాగునీటి అవసరాల కోసం తెలుగు రాష్ట్రాలకు కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ నీటి కేటాయింపులు చేసింది. ఈ మేరకు తెలంగాణ (Telangana) 8.5 టీఎంసీలు, ఏపీ 5.5 టీఎంసీలు తీసుకునేందుకు అంగీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ లోని బోర్డు కార్యాలయంలో బోర్డు మెంబర్ సెక్రటరీ డీఎం రాయిపురే, తెలంగాణ నీటి పారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ అనిల్ కుమార్, ఏపీ జల వనరుల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ నారాయణరెడ్డిలతో కూడిన త్రిసభ్య కమిటీ శుక్రవారం సమావేశమైంది. 2 గంటలకు పైగా సాగిన భేటీలో ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య వాదోప వాదనలు చోటు చేసుకున్నాయి. సాగర్ నుంచి 14 టీఎంసీలు కావాలని ఏపీ కోరగా.. 10 టీఎంసీలు కావాలని తెలంగాణ డిమాండ్ చేశాయి. వీటిని కమిటీ తిరస్కరించింది. కాగా, గతేడాది అక్టోబర్ లో జరిగిన త్రిసభ్య కమిటీ సమావేశంలో శ్రీశైలం, సాగర్ ల నుంచి ఏపీకి 45 టీఎంసీలు, తెలంగాణకు 35 టీఎంసీలు కేటాయించిన నేపథ్యంలో ఈ కోటా నీటి వినియోగంపై పరస్పరం ఆరోపణలతో వాడీ వేడీగా చర్చ సాగింది.
Also Read: Telangana News వరంగల్‌లో గురు శిష్యుల మాటల యుద్ధం- కావ్య వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేసిన ఆరూరి రమేష్

మరిన్ని చూడండి



Source link

Related posts

AP police caught smuggling ganja arrested in Hyderabad | Andhra Pradesh Police : గంజాయి స్మగ్లింగ్ చేస్తూ దొరికిన ఏపీ పోలీసులు

Oknews

ప్రశాంతంగా ఇంటర్ ఫస్టియర్ తొలి పరీక్ష- 19 వేల మంది గైర్హాజరు, 3 మాల్ ప్రాక్టీస్ కేసులు-hyderabad news in telugu ts inter exams started first day 19 thousand not attended ,తెలంగాణ న్యూస్

Oknews

టాలీవుడ్ హీరో లవర్ వద్ద డ్రగ్స్ సీజ్-hyderabad news in telugu narsingi police raids tollywood hero lover caught with drugs ,తెలంగాణ న్యూస్

Oknews

Leave a Comment