EntertainmentLatest News

రామాయణ గాథను నిజాయితీగా తెరకెక్కిస్తాం.. నిర్మాతల్లో ఒకరైన యశ్‌ క్లారిటీ!


కమర్షియల్‌ సినిమాలు, హై ఓల్టేజ్‌ యాక్షన్‌ మూవీస్‌ చూసి చూసి ప్రేక్షకులకు మొహం మొత్తుతోంది. అందుకే డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో రూపొందే సినిమాలను ఆదరిస్తున్నారు. ముఖ్యంగా మైథాలజీ కథలతో అందర్నీ ఆకట్టుకునే విధంగా సినిమాలు తీస్తే తప్పకుండా ఆదరణ లభిస్తుందని గతంలోనే రుజువైంది. ఇటీవల ప్రభాస్‌ ప్రధాన పాత్రలో ఓం రౌత్‌ రూపొందించిన ‘ఆదిపురుష్‌’ చిత్రం ఘోర పరాజయాన్ని చవిచూసింది. పేరుకి రామాయణం అని చెప్పినా, ఎక్కడా ఆ పోకడలు లేకుండా ఆడియన్స్‌కి అలాంటి ఫీల్‌ రాకుండా తీశాడు. రామాయణ గాథతోనే సినిమా చేస్తున్నానని ధైర్యంగా చెప్పుకోలేకపోయాడు ఓం రౌత్‌. దానికి తగ్గట్టుగానే సినిమా ఔట్‌పుట్‌ కూడా ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ప్రేక్షకులు ఆ సినిమాని తిప్పి కొట్టారు. ఇప్పుడు మరో దర్శకుడు రామాయణ గాథను తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు. నితిష్‌ తివారి దర్శకత్వంలో రూపొందే ఈ సినిమాలో రణబీర్‌ కపూర్‌ రాముడిగా, సాయిపల్లవి సీతగా, యశ్‌ రావణాసురుడుగా నటించబోతున్నారు. అంతేకాదు, ఈ సినిమా నిర్మాణంలో యశ్‌ కూడా ఒక భాగస్వామి కావడం విశేషం. 

ఈ సినిమా గురించి యశ్‌ మాట్లాడుతూ ‘మన పురాణాల్లో రామాయణ గాథకు ఒక విశిష్టత ఉంది, మానవ జీవితాలను అది ఎంతో ప్రభావితం చేసింది. ఈ కథ వల్ల ఎంతో జ్ఞానం చేకూరుతుంది. మనిషికి అంతుపట్టని ఎన్నో విషయాలు అందులో దాగి వున్నాయి. అన్ని విషయాలను నిశితంగా పరిశీలించి ఎంతో నిజాయితీగా రామాయణాన్ని తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నాం. రామాయణంలోని ఎన్నో విలువైన అంశాలను, ఎమోషన్స్‌ను ప్రపంచానికి తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నాం. నమిత్‌, నేను కలిసి ఇలాంటి రామాయణ గాథను తెరకెక్కిస్తే బాగుంటుందని ఎంతో కాలం నుంచి అనుకుంటున్నాం. ఇలాంటి సబ్జెక్ట్‌తో సినిమా తియ్యడం అంటే మామూలు విషయం కాదు. ఇంతటి విస్తృతమైన కథతో సినిమా చెయ్యాలంటే బడ్జెట్‌ కూడా ఎక్కువ అవుతుంది. అందుకే నేను కో ప్రొడ్యూసర్‌గా వుండాలనుకుంటున్నాను’ అన్నారు. 

నిర్మాత నమిత్‌ మల్హోత్రా తెలియజేస్తూ ‘యు.ఎస్‌., యు.కెలలో వ్యాపారాలు చేసి సక్సెస్‌ అయిన నేను రామాయణ గాథతో సినిమా తీసి సక్సెస్‌ సాధించగలనన్న నమ్మకం ఉంది. కర్ణాటక నుండి వచ్చి కెజిఎఫ్‌ సిరీస్‌ కోసం యశ్‌ ఎంతో కష్టపడ్డాడు. ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు. ఇలాంటి భారీ ప్రాజెక్ట్‌ ద్వారా ప్రపంచానికి ఎన్నో విషయాలు చెప్పాలంటే అది యశ్‌లాంటి హీరోకే సాధ్యమవుతుంది’ అన్నారు. 



Source link

Related posts

Manchu Manoj Reaction on HanuMan హనుమాన్‌పై మంచు మనోజ్ ట్వీట్

Oknews

అప్పుడే ఓటీటీలోకి 'భారతీయుడు 2'

Oknews

ప్రభాస్‌ ‘కల్కి’ విషయంలో అలా చేస్తే జైలు శిక్ష తప్పదు

Oknews

Leave a Comment