EntertainmentLatest News

ఫ్యామిలీ స్టార్ హీరోయిన్ మృణాల్ కీలక వ్యాఖ్యలు.. సినిమా పరాజయంతో నాకు సంబంధం లేదు 


సీతారామం తో తెలుగు వారి అభిమాన కథానాయకిగా మారిన నటి మృణాల్ ఠాకూర్. తను ఎంత అందంగా ఉంటుందో తన నటన కూడా అంతే అందంగా ఉంటుంది. అందుకే అనతి కాలంలోనే టాప్ హీరోయిన్ రేంజ్ కి దూసుకెళ్లింది. బడా హీరోలు సైతం మృణాల్ తమ సినిమాలో నటించాలని కోరుకుంటున్నారంటే ఆమె స్టామినా ని అర్ధం చేసుకోవచ్చు. ఏ క్యారెక్టర్లో కి అయినా  ఈజీగా ఒదిగిపోవడం ఆమె స్పెషాలిటీ.అందుకే ఆమెకి అంత డిమాండ్.  తాజాగా ఒక ఇంటర్వ్యూ లో  ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రాధాన్యతని సంతరించుకున్నాయి.

రాత్రికి రాత్రే జీవితం మారిపోవాలనే ఆలోచనతో నేనెప్పుడూ నిర్ణయాలు తీసుకోలేదు. నా దృష్టిలో తాత్కాలికంగా వచ్చే పేరు, డబ్బు ఎప్పుడు  గొప్పవి కావు.  నాకు కావాల్సిందల్లా ప్రేక్షకులు  కొన్నాళ్లపాటైనా నన్ను  గుర్తుంచుకోవాలి. అందుకోసం సినిమాల్లో కష్టపడుతూనే ఉంటాను. అందులోనే  నాకు సంతృప్తి ఉంటుంది.  ఒక సినిమా కోసం వందల రోజులు సమయం కేటాయిస్తున్నపుడు ఆ ప్రయాణం ఎంతో ఉత్సాహంగా ఉండాలి. అలా జరగాలంటే సరైన కథల్ని, పాత్రల్ని ఎంచుకోవాలి . అప్పుడే  నటీ నటుల్లో ఉత్సాహం ఉంటుంది. అందుకే కథల విషయంలో పక్కాగా  ఉంటా కాకపోతే జయాపజయాలని ఒకేలా స్వీకరిస్తా. అందుకు తగ్గట్టే నా ప్రయాణం ఉంటుందని చెప్పింది

మృణాల్  రీసెంట్ గా విజయ్ దేవరకొండ తో కలిసి ఫ్యామిలీ స్టార్ లో సందడి చేసింది. ఆ సినిమా ఫలితం ఎలా ఉన్నా ఆమె  నటనకి మాత్రం మంచి పేరు వచ్చింది. అంతకు ముందు నాని తో హాయ్ నాన్న చేసింది. అది మంచి విజయాన్నే  నమోదు చేసింది. మరికొన్ని కొత్త  సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. చిరంజీవి విశ్వంభర లో చెయ్యబోతుందనే రూమర్ అయితే వినిపిస్తుంది.


 



Source link

Related posts

‘హనుమాన్’ ఓటీటీ రిలీజ్ డేట్ మారింది!

Oknews

Mammootty : టర్బోగా మమ్ముట్టి మరో కొత్త అవతారం!

Oknews

ఫ్యామిలీతో మృణాల్ గుడి పడ్వా సెలబ్రేషన్స్

Oknews

Leave a Comment