యువత టార్గెట్ గా గంజాయి విక్రయం..జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఈ సందర్భంగా మాట్లాడుతూ…. NDPS యాక్ట్ లోని నియమ నిబంధనల ప్రకారం జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో నిల్వ ఉన్న గంజాయిని(Cannabis) దహనం చేయడం జరిగిందని తెలియజేసారు. కొందరు అక్రమార్జనలో భాగంగా గంజాయిని విక్రయిస్తూ పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని యువతను ప్రలోభాలకు గురి చేస్తూ మత్తులోకి దించుతున్నారని, ఇలా అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడే వారిని అరికట్టడం కోసం జిల్లా వ్యాప్తంగా రహస్య బృందాల్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఎవరైనా గంజాయి, ఇతర మత్తు పదార్థాలను విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇకపై మత్తుకు బానిసలై గంజాయి లాంటి మత్తు పదార్ధాలను సేవించే వారిపై కూడా కేసులు నమోదు చేసి జైలుకు పంపడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ తో పాటు డిఎస్పీలు రెహమాన్, సతీష్ కుమార్, డీసిఆర్బీ డిఎస్పీ మల్లయ్య స్వామి, సీఐ శ్రీనివాస్, ఆర్ఐలు, సీఐలు, సిబ్బంది పాల్గొన్నారు.
Source link