Telangana

Hill Stations around Hyderabad | హిల్ స్టేషన్స్ ఇష్టపడేవారు ఎక్కడెక్కడో వెతికే పనిలేదు..హైదరాబాద్ చుట్టుపక్కనే బోలెడన్ని ఉన్నాయి



Hyderabad News: సమ్మర్‌లో కానీ, వీకెండ్స్ లో ప్రకృతిలో సేదదీరటానికి, పొగమంచు అందాలను చూడటానికి, ఫ్యామిలీతో ఉత్సాహంగా గడపటానికి ఎక్కువ మంది హిల్ స్టేషన్స్ కి వెళ్లటానికి ఇష్టపడుతుంటారు. అయితే, హైదరాబాద్ చుట్టుపక్కనే ఇన్ని హిల్ స్టేషన్స్ ఉండగా, వేరే స్టేట్స్ లో వెతికే పనేముంది. ఓసారి ఇటు లుక్కేసి, ఈ వీకెండ్ కి చెక్కేయండి మరి!
అనంతగిరి హిల్స్
హిల్ స్టేషన్ అనగానే హైదరాబాద్ చుట్టుపక్కన వారికి మొదట గుర్తొచ్చే పేరు అనంతగిరి హిల్స్. మొదటిసారి ట్రెక్కింగ్ చేసేవారికి, అడ్వెంచర్స్ ఇష్టపడేవారికి ఇది బెస్ట్ ప్లేస్. ఇక్కడ కాఫీ తోటలు, సీజన్ ను బట్టి ప్రవహించే జలపాతాలు, నిండుగా పచ్చని చెట్లు, పర్వతాలతో ఎంతో అందంగా ఉంటుంది. హైదరాబాద్ నుంచి కేవలం 78 కి.మీ మాత్రమే. ట్రైబల్ మ్యూజియం, తూర్పు కనుమలలోని ఆదివాసీ గిరిజనుల  బతుకు చిత్రాన్ని తెలియజేసే సెంటర్‌, గిరిజన ఆభరణాలు, హస్తకళ మొదలైన వాటిని స్థానిక కళాకారులు ప్రదర్శిస్తుంటారు. పద్మాపురం బొటానికల్ గార్డెన్, అనంతపద్మనాభస్వామి ఆలయం, నాగసముద్రం సరస్సు అదనపు ఆకర్షణలు.
హార్సిలీ హిల్స్
హార్సిలీ హిల్స్ హైదరాబాదు సమీపంలోని అత్యంత అందమైన హిల్ స్టేషన్‌లలో ఒకటి. హైదరాబాద్ నుంచి 528 కి.మీ దూరంలో ఉంది. ఇక్కడి ఆహ్లాదకరమైన వృక్ష సమపద, సుసంపన్నమైన జంతుసమపద వల్ల హార్సిలీ హిల్స్ ను ఆంధ్రా ఊటీ అని కూడా పిలుస్తారు. పర్వతాల నుంచి వచ్చే చల్లటి గాలి, దట్టమైన అడవులు, తూర్పు కనుమల విశాల దృశ్యాలు ఎంతో సుందరంగా ఉంటాయి. ఇక్కడ ప్రపంచంలోనే అతిపెద్ద మర్రి చెట్టు తిమ్మమ్మ మర్రిమాను 8 ఎకరాల విస్తీర్ణంలో హార్సిలీ హిల్స్ నుంచి 75 కిలోమీటర్ల దూరంలో ఉంది. హార్సిలీ హిల్స్ చుట్టూ ఉన్న కొండలపైన కొన్ని పురాతన దేవాలయాలు కూడా కూడా ఉన్నాయి. ఇక్కడ అడ్వెంచర్స్, ట్రెక్కింగ్, వన్యప్రాణులను చూడటానికి పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు. 
అరకు వ్యాలీ 
విశాఖపట్నంలోని అరకు లోయ హైదరాబాద్‌కు 666 కి. మీ దూరంలో ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని అత్యంత సుందరమైన హిల్ స్టేషన్‌లలో అరకు వ్యాలీ ఒకటి. ఇది గొప్ప జీవ వైవిధ్యానికి ప్రసిద్ధి చెందింది. పూర్తిగా ఆహ్లాదకరమైన ఈ విహారయాత్ర దట్టమైన అడవులు, కాఫీ తోటలతో నిండి ఉంటుంది. అరకు లోయ అనేక ఆదివాసీ తెగలకు నిలయం. దారిపొడవునా మలుపులు తిరుగుతూ, సుందర దృశ్యాలను చూస్తూ డ్రైవ్ ఎంజాయ్ చేయొచ్చు. 29 కిలోమీటర్ల దూరంలో ఉన్న బొర్రా  కేవ్స్ ప్రత్యేక ఆకర్షణ. భీమునిపట్నం బీచ్, రామ కృష్ణ బీచ్,  లాసన్స్ బే, రిషికొండ బీచ్‌లు ఇండియాలోని తూర్పు తీరంలో ఉన్న ఫేమస్ బీచ్ లు. 
చిక్కమగళూరు
ఒకప్పటి సక్రేపట్నానికి అధిపతి చిన్న కూతురైన రుక్మాంగదకు కట్నంగా ఇచ్చినందుకు  ‘యంగ్ డాటర్స్ టౌన్ ‘ అని, అదే చిక్కమగళూరు అయింది. , ఈ ప్రశాంతమైన నగరాన్ని ‘కాఫీ ల్యాండ్ ఆఫ్ కర్ణాటక’ అని కూడా పిలుస్తారు. చిక్కమగళూరు 3,400 అడుగుల ఎత్తులో ఉంది. ఇది టీ, కాఫీ తోటలతో నిండి ఉంది. పచ్చని చెట్లతో ఉన్న ఈ హిల్ స్టేషన్ .. ట్రెక్కర్లు, ప్రకృతి ప్రియులు, థ్రిల్ కోరుకునేవారు ఎక్కువగా వస్తుంటారు. శారదాంబ ఆలయం, విద్యాశంకర దేవాలయం, కోదండ రామస్వామి ఆలయం, అమృతేశ్వరాలయం వంటి అనేక పురాతన దేవాలయాలు ఇక్కడ ఉన్నాయి. ఇవే కాకుండా, ఝరి జలపాతాలు, హనుమాన్  జలపాతాలు, శంకర్ జలపాతాలు,  కాదంబి జలపాతాలు మంత్రముగ్ధులను చేస్తాయి. మర్చిపోకుండా కెమెరా తీసుకెళ్తే ఎన్నో మంచి ఫోటోస్ తీసుకోవచ్చు. ఇన్స్టాగ్రాం ఇంఫ్లూయెన్సర్స్ అయితే ఈ లోకేషన్స్ చూసి పండగ చేసుకుంటారు. 

మరిన్ని చూడండి



Source link

Related posts

తెలంగాణ సచివాలయంలో ఎలుకల బెడద..!-rats problem in telangana secretariat arrangement of bones in several rooms ,తెలంగాణ న్యూస్

Oknews

Singareni Collieries Company has released notification for the recruitment of 327 various Posts check details here

Oknews

తెలంగాణ గవర్నర్ గా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణస్వీకారం.!

Oknews

Leave a Comment