EntertainmentLatest News

మహేష్‌ లుక్‌ పూర్తిగా మారిపోతోంది.. రెడీ అవుతున్న రాజమౌళి!


ప్రస్తుతం టాలీవుడ్‌లో ఎన్నో సినిమాలకు సంబంధించిన డిస్కషన్స్‌ జరుగుతున్నాయి. ముఖ్యంగా స్టార్‌ హీరోల సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్‌ కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వాటిలో అతి ముఖ్యమైనదిగా అందరూ భావించేది మహేష్‌, రాజమౌళి సినిమానే. వీరి కాంబినేషన్‌లో సినిమా రాబోతోంది అనే ఎనౌన్స్‌మెంట్‌ వచ్చినప్పటి నుంచి రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సినిమా బ్యాక్‌డ్రాప్‌, స్టోరీ, మహేష్‌ గెటప్‌.. వీటి గురించి ఎవరికి తోచిన విధంగా వారు చెప్పుకుంటున్నారు. అయితే ఈ సినిమా ఫారెస్ట్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఉండబోతోంది అనే విషయాన్ని మాత్రం క్లారిఫై చేశారు. 

ఇప్పుడు ఈ సినిమాలో మహేష్‌ లుక్‌ ఎలా ఉండబోతోంది అనే దాని గురించి తీవ్రంగా చర్చించుకుంటున్నారు నెటిజన్లు, ఫాన్స్‌. ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్‌ ఫ్లాష్‌ బ్యాక్‌ ఉంటుందట. అందులో మహేష్‌ లుక్‌ చాలా రగ్‌డ్‌గా క్రియేట్‌ చేయబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు మహేష్‌ అలాంటి లుక్‌లో కనిపించలేదు. మరి ఈ సినిమాలో అతని లుక్‌కి ఎలాంటి రెస్పాన్స్‌ వస్తుందో చూడాలి. ఇప్పటికే ఈ సినిమా ఇండియానా జోన్స్‌ తరహాలో ఉంటుందనే విషయం రివీల్‌ అయిపోయింది. ఆ సినిమాలో హరిసన్‌ ఫోర్డ్‌ లుక్‌ ఎలా ఉంటుందో ఇందులో మహేష్‌ కూడా అలాగే ఉంటాడని అర్థమవుతోంది. 

ఈ సినిమా కథ ఎలా ఉండబోతోంది అనే దానిపై విజయేంద్రప్రసాద్‌ ఒక క్లారిటీ ఇచ్చాడు. తనకి, రాజమౌళికి సౌత్‌ ఆఫ్రికా నవలా రచయిత విల్బర్‌ స్మిత్‌ అంటే ఎంతో అభిమానమని, అందులో ఆయన రచించిన పుస్తకాల ఆధారంగానే ఈ సినిమా స్క్రిప్ట్‌ను రెడీ చేస్తున్నట్టు చెప్పారు. ఇప్పటివరకు రాజమౌళిగానీ, విజయేంద్రప్రసాద్‌గాని చెప్పిన దాన్ని బట్టి ఇప్పటివరకు తెలుగులో ఇలాంటి సబ్జెక్ట్‌తో, ఇలాంటి బ్యాక్‌డ్రాప్‌తో సినిమా రాలేదని ప్రచారం జరుగుతోంది. ఓ పక్క ఈ సినిమాలోని డైలాగ్స్‌ను సాయిమాధవ్‌ బుర్రా రాస్తున్నారు. ఇప్పటివరకు ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు. అయితే త్వరలోనే ఈ సినిమాను సెట్స్‌కి తీసుకెళ్ళబోతున్నారని, త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. 



Source link

Related posts

బెల్లంకొండ వరల్డ్ రికార్డు.. స్టార్స్ కూడా టచ్ చేయలేరు!

Oknews

‘రజాకార్’ మూవీ రివ్యూ

Oknews

రామ్‌గోపాల్‌వర్మతో రష్మిక మందన్న.. షాక్‌ అయిన నెటిజన్లు!

Oknews

Leave a Comment