EntertainmentLatest News

జిమ్ లో ఎన్టీఆర్ తో హాట్ బ్యూటీ.. పెద్ద ప్లానే ఇది!


ప్రస్తుతం బాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ పేరు మారుమోగిపోతోంది. ‘వార్-2’ తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ఎన్టీఆర్.. ఆ మూవీ కోసం ఇటీవల ముంబై వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తారక్ కి సంబంధించిన పలు ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అలాగే ఎన్టీఆర్ యాక్టింగ్ టాలెంట్ గురించి, స్టార్డం గురించి అప్పుడే హిందీ స్టార్ల గురించి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా నటి ఊర్వశి రౌతేలా కూడా తారక్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

జిమ్ లో ఎన్టీఆర్ తో సెల్ఫీ దిగిన ఊర్వశి.. ఆ ఫొటోని ఇన్‌స్టాగ్రామ్ షేర్ చేసింది. ఈ సందర్భంగా ఆమె తారక్ ని పొగడ్తలతో ముంచెత్తింది. ఎన్టీఆర్ గారు నిజమైన గ్లోబల్ సూపర్ స్టార్ అంటూ ప్రశంసించింది. ఆయన క్రమశిక్షణగా, నిజాయితీగా, ముక్కు సూటిగా, వినయంగా ఉంటారని చెప్పుకొచ్చింది. ఎన్టీఆర్ వ్యక్తిత్వం నిజంగా ప్రశంసనీయం అన్న ఊర్వశి.. ఆయనతో కలిసి పని చేయడానికి ఎంతగానో ఎదురు చూస్తున్నట్లు తెలిపింది. ఎన్టీఆర్ గురించి ఊర్వశి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అలాగే ఆమె షేర్ చేసిన ఫొటోలో ఫిల్టర్ యూజ్ చేయడంతో ఎన్టీఆర్ ఎంతో యంగ్ గా కనిపిస్తున్నాడు.



Source link

Related posts

హీరో తొట్టెంపూడి వేణు తండ్రి కన్నుమూత

Oknews

మనోజ్ పనైపోయింది, కెరీర్ ఖతం అన్నారు.. మౌనంగా భరించా.. తిరిగొస్తున్నా!

Oknews

A సర్టిఫికెట్ ఇచ్చిన సెన్సార్ కి థాంక్స్ చెప్పిన EVOL మూవీ దర్శక, నిర్మాత రామ్ యోగి వెలగపూడి!

Oknews

Leave a Comment