Telangana

టీఎస్ ఇంటర్, టెన్త్ ఫలితాలపై అప్డేట్- ఈ తేదీల్లో రిజల్ట్స్ విడుదల?-hyderabad ts inter and ssc results 2024 updates expected date time in april may ,తెలంగాణ న్యూస్



తెలంగాణ ఇంటర్ ఫలితాలు 2024 ఆన్‌లైన్‌లో ఎలా తనిఖీ చేయాలి?(TS Inter 2024 Results Download)అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://tsbie.cgg.gov.in/home.do లేదా ఇతర ఫలితాల పోర్టల్‌లను https://telugu.hindustantimes.com/telangana-board-result సందర్శించండి.ఇంటర్ ఫలితాల కోసం నిర్దేశించిన ట్యాబ్‌ పై క్లిక్ చేయాలి.మీ రోల్ నంబర్ లేదా హాల్ టికెట్ నంబర్, అవసరమైన సమాచారాన్ని నమోదు చేయండి.అన్ని వివరాలను చెక్ చేసుకుని, సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయండి.స్క్రీన్‌పై మీ ఫలితాలు కనిపిస్తాయి. అందులో మీ వివరాలు నిర్ధారించుకోండి.ఆ తర్వాత ఫలితాలను డౌన్ లోడ్ చేసుకుని తదుపరి అవసరాలకు ప్రింట్ తీసుకోండి.తెలంగాణ పదో తరగతి ఫలితాలు ఎప్పుడంటే?(TS SSC 2024 Results Date and Time)తెలంగాణలో పదో తరగతి పరీక్షల(TS 10th Results 2024) జవాబు పత్రాల మూల్యాంకనం దాదాపుగా పూర్తి కావొచ్చింది. ఏప్రిల్ 3న ప్రారంభమైన స్పాట్ వాల్యూయేషన్ (Spot Valuation)ప్రక్రియ ఏప్రిల్ 13 వరకు కొనసాగింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 19 కేంద్రాలలో స్పాట్ వాల్యూయేషన్ చేశారు. మార్కులు కంప్యూటరీకరణ, పునఃపరిశీలన ప్రక్రియ పూర్తి కాగానే…ఏప్రిల్ చివరి వారంలో లేదా మే మొదటి వారంలో తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల చేయనున్నారు. విద్యార్థులు ఫలితాల అప్ డేట్స్ కోసం అధికారిక వెబ్ సైట్ bse.telangana.gov.in చెక్ చేయవచ్చు. ఈ ఏడాది తెలంగాణ ఎస్ఎస్సీ పరీక్షలు(TS SSC Exams)మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు నిర్వహించారు. పదో తరగతి ఫలితాల తేదీ, సమయంపై ఎస్ఎస్సీ బోర్డు ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. టీఎస్ ఇంటర్ ఫలితాలు 2024 విడుదలైన వారం రోజుల తర్వాత పదో తరగతి ఫలితాల విడుదల చేస్తామని అధికారులు అంటున్నారు.



Source link

Related posts

నెలాఖరులోగా మేడారం పనులు పూర్తి, నాణ్యత లేని పనులుచేస్తే సీరియస్ యాక్షన్- మంత్రులు-medaram news in telugu minister seethakka konda surekha reviews on medaram maha jatara 2024 ,తెలంగాణ న్యూస్

Oknews

TS AP Weather : తెలంగాణకు చల్లటి కబురు – 4 రోజులపాటు వర్షాలు, తగ్గనున్న ఎండలు

Oknews

Digital Payments Chartered Planes In Telangana On Election Commission Radar

Oknews

Leave a Comment