Entertainment

మహేష్ బాబు  ఫ్యాన్స్ డల్..ఇది మా రేంజ్ కాదు  


పెద్ద హీరో అయినా  చిన్న హీరో అయినా  ఒక మూవీ రిలీజ్ అయిందని అనుకుందాం.ఇక  ఆ తర్వాత మూవీకి  కలెక్షన్స్  ఎంత వచ్చాయి. ఓటిటి లో ఎప్పుడు వస్తుంది. టెలివిజన్ లో ఎప్పుడు వస్తుంది.వస్తే  రేటింగ్ ఎంత వచ్చింది అనే  చర్చ ఎక్కువగా  నడుస్తు  ఉంటుంది. ఇప్పుడు ఇదే చర్చ మహేష్ నయా మూవీ విషయంలో జరుగుతుంది.


మహేష్ వన్ మాన్ షో  గుంటురు కారం మొన్న ఉగాదికి ప్రముఖ టెలివిజన్ ఛానెల్ జెమినీ లో ప్రసారం అయ్యింది. ఇప్పుడు  ఆ చిత్రానికి సంబంధించిన టీఆర్పీ రేటింగ్ వచ్చింది.  9.23 రేటింగ్ ని గుంటూరు కారం దక్కించుకుంది. అయితే  మహేష్ గత  చిత్రం సర్కారు వారి పాటకి స్టార్ మా లో 9.45  రేటింగ్ వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే మహేష్ లాంటి స్టార్ నటుడికి ఆ రేటింగ్స్ తక్కువనే చెప్పాలి. ఫ్యాన్స్ కూడా ఈ విషయంలో కొంచం డల్ గానే ఉన్నారు.

 

శ్రీ లీల హీరోయిన్ గా నటించిన గుంటూరు కారం ఈ ఏడాది సంక్రాంతికి వచ్చి 172 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని సాధించింది.   రమ్య కృష్ణ, ప్రకాష్ రాజ్, జయరామ్, జగపతి బాబు, ఈశ్వరి రావు తదితరులు కీలక పాత్రల్లో నటించారు.  థమన్ సంగీతాన్ని అందించగా  త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వాన్ని వహించాడు. మహేష్ తన అప్ కమింగ్ మూవీని రాజమౌళి దర్శకత్వంలో చెయ్యబోతున్నాడు.ఈ సినిమాకి  వరల్డ్ వైడ్ గా క్రేజ్ ఉంది. త్వరలోనే ఆ చిత్రం షూటింగ్ కి వెళ్లనుంది.

 



Source link

Related posts

బాలయ్య క్రేజ్.. ఒకేసారి పది కోట్లు పెరిగిన రెమ్యూనరేషన్!

Oknews

Weapon Movie Review : వెపన్ మూవీ రివ్యూ

Oknews

మెగాఫోన్ ప‌ట్ట‌నున్న న‌టి రోహిణి

Oknews

Leave a Comment