Entertainment

‘మార్కెట్ మహాలక్ష్మి’ మూవీ రివ్యూ


సినిమా పేరు: మార్కెట్ మహాలక్ష్మి  

తారాగణం: పార్వతీశం, ప్రణీకాన్వికా, హర్ష వర్ధన్, మహబూబ్ బాషా, ముక్కు అవినాష్, కేదార్ శంకర్, తదితరులు 

సినిమాటోగ్రఫీ: సురేంద్ర చిలుముల

సంగీతం: జో ఎన్మవ్  

బ్యాగ్రౌండ్ స్కోర్: సృజన శశాంక

ఎడిటర్: ఆర్.ఎం. విశ్వనాధ్ కూచనపల్లి

రచన, దర్శకత్వం: వి.ఎస్. ముఖేష్

నిర్మాత : అఖిలేష్ కలారు

బ్యానర్: బి2పి స్టూడియోస్ 

విడుదల తేదీ: ఏప్రిల్ 19, 2024

‘కేరింత’ ఫేమ్ పార్వతీశం, నూతన పరిచయం హీరోయిన్ ప్రణీకాన్వికా జంటగా నటించిన చిత్రం ‘మార్కెట్ మహాలక్ష్మి’. విఎస్ ముఖేష్ దర్శకత్వంలో బి2పి స్టూడియోస్ అఖిలేష్ కలారు నిర్మించారు. ప్రచార చిత్రాలు ఆకట్టుకోవడంతో ఈ సినిమా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకు రానుండగా, ఒక రోజు ముందుగా చిత్ర యూనిట్ ప్రెస్ షో నిర్వహించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.

కథ: 

ఇది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గా పని చేసే యువకుడికి, మార్కెట్‌లో కూరగాయలు అమ్మే యువతికి మధ్య జరిగే ప్రేమ కథ. హీరో పార్వతీశం సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గా పని చేస్తుంటాడు. ప్రభుత్వాఫీసులో గుమస్తాగా పని చేసే అతని తండ్రి(కేదార్ శంకర్) తన కుమారుడి చదువుకి పెట్టిన ఖర్చుని కూడా పెట్టుబడిగా భావిస్తాడు. బాగా కట్నం తెచ్చే అమ్మాయితో తన కుమారుడి పెళ్లి చేసి.. పెట్టిన ఖర్చుకి వడ్డీతో సహా రాబట్టుకోవాలని ప్లాన్ చేస్తాడు. కానీ హీరో పార్వతీశం తన తండ్రికి ఊహించని షాకిస్తాడు. మార్కెట్‌లో కూరగాయలు అమ్మే మహాలక్ష్మి(ప్రణీకాన్విక)ని ప్రేమిస్తాడు. ఆమెనే పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. అయితే మహాలక్ష్మికి తన కుటుంబం, మార్కెటే ప్రపంచం. పైగా, ప్రేమ అంటే ఆమెకి సదాభిప్రాయం లేదు. దానికి తోడు హీరో సాఫ్ట్ అయితే, ఆమె మాత్రం ఫుల్ రెబెల్. అలాంటి అమ్మాయిని ప్రేమలో పడేయడానికి హీరో ఏం చేశాడు? తండ్రి మాట కాదని, ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలన్న హీరో కోరిక నెరవేరిందా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

విశ్లేషణ: 

సాఫ్ట్‌వేర్ యువకుడి జీవితం, మార్కెట్ లో కూరగాయలు అమ్మే యువతి జీవితం రెండూ పూర్తి భిన్నంగా ఉంటాయి. అలాంటిది వారి మధ్య ప్రేమ కథ నడిపించాలన్న దర్శకుడు ఆలోచన బాగుంది. కట్నం కోసం తండ్రి చూపించిన రిచ్ అమ్మాయిని పెళ్లి చేసుకునే కంటే, ఇండిపెండెంట్‌ గా బతికే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే.. భవిష్యత్తులో ఏ సమస్య వచ్చినా తను చూసుకుంటుందనే భరోసా ఉంటుందని ఆలోచించే హీరో కథే ఈ ‘మార్కెట్ మహాలక్ష్మి’. దర్శకుడు మంచి పాయింట్ ని తీసుకోవడమే కాకుండా.. ప్రేక్షకులను మెప్పించేలా దానిని తెరమీదకు తీసుకు రావడంలో కూడా బాగానే సక్సెస్ అయ్యాడు. ఈ లవ్ స్టోరీని ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా మలిచిన తీరు బాగుంది. కొన్ని సన్నివేశాలు సాగదీతగా అనిపించినప్పటికీ.. డైలాగ్స్, కామెడీతో సినిమా సరదాగా నడిచింది. ఫస్టాఫ్ తో పోలిస్తే సెకండాఫ్ మెరుగ్గా ఉంది. కొన్ని సినిమాటిక్ గా ఉండే, సిల్లీగా అనిపించే సన్నివేశాలను పక్కన పెడితే.. ఓవరాల్ గా మాత్రం సినిమా బాగానే ఉంది.

సురేంద్ర చిలుముల సినిమాటోగ్రఫీ పర్వాలేదు. జో ఎన్మవ్ ఇచ్చిన సంగీతం ఆశించిన స్థాయిలో లేదు. సాఫ్ట్ వేర్ పోరగా సాంగ్ మాత్రమే ఆకట్టుకుంది. సృజన శశాంక నేపథ్య సంగీతం బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

నటీనటుల పనితీరు:

మార్కెట్‌లో కూరగాయలు అమ్మే యువతిని ప్రేమించే సాఫ్ట్‌వేర్ యువకుడి పాత్రలో పార్వతీశం చక్కగా ఒదిగిపోయాడు. అతని నటనలో సహజత్వం కనిపించింది. ఇక టైటిల్ రోల్ పోషించిన ప్రణికాన్విక.. మహాలక్ష్మి పాత్రకి పూర్తి న్యాయం చేసింది. పాత్రలో ఉన్న చురుకుతనం, గడుసుతనం చక్కగా ప్రదర్శించింది. ముక్కు అవినాష్, మహబూబ్ బాషా, పూజా విశ్వేశ్వర్, హర్షవర్ధన్, కేదార్ శంకర్, జయ, పద్మ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. 

ఫైనల్ గా..

దర్శకుడు ఎంచుకున్న పాయింట్ కొత్తగా ఉంది. అంచనాలు పెట్టుకోకుండా వెళ్తే.. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను బాగానే ఎంజాయ్ చేయవచ్చు.

రేటింగ్: 2.75/5 



Source link

Related posts

‘నాగేంద్రన్స్ హానీమూన్స్’ వెబ్ సిరీస్ రివ్యూ

Oknews

పూనమ్ పాండే బ్రతికే ఉంది.. ఇలా కూడా ప్రాంక్ చేస్తారా?..

Oknews

నందమూరి అభిమానులూ.. సంబరాలకు సిద్ధమేనా!

Oknews

Leave a Comment