కొద్దిరోజులుగా మీడియా ముందు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విషయంలో వైస్ షర్మిల, సునీత చేస్తున్న వ్యాఖ్యలకు కోర్టు అడ్డుకట్ట వేసింది. షర్మిల, సునీతలేక్ కాదు.. ఈ కేసు విషయంలో ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్ష పార్టీ నాయకులైన చంద్రబాబు కానీ, లోకేష్ కానీ, పురందరేశ్వరి, పవన్ కానీ మాట్లాడకూడదని వైఎస్ వివేకా హత్యపై కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రస్తుతం వైఎస్ వివేకా హత్యపై ఎవరూ మాట్లాడొద్దని కడప కోర్టు తీర్పు నిచ్చింది. వైఎస్ వివేకా హత్య ప్రస్తావనపై, వైసీపీ లోని ప్రముఖ నాయకల పేర్లని ప్రస్తావిస్తూ ఈ కేసు విషయంలో ప్రతి పక్షాలు బురద చల్లే ప్రయత్నం చేస్తున్నాయని వైసీపీ నేత సురేష్ తన పిటిషన్ తో పాటుగా కడప కోర్టును ఆశ్రయించాడు.
ఈ కేసులో ప్రతివాదులుగా షర్మిల, సునీత, చంద్రబాబు, లోకేష్, పురందేశ్వరి, పవన్, రవీంద్రనాథ్‌రెడ్డి లను చేర్చగా.. పిటిషనర్ తరుపున వాదనలు న్యాయవాది నాగిరెడ్డి వినిపించారు. ఈ కేసు విచారణాంతరం కడప కోర్టు వైఎస్ షర్మిల, సునీత, చంద్రబాబు, పవన్‌ల పటు పాటుగా లోకేష్, పురందేశ్వరిని కూడా వివేకా హత్యపై ప్రస్తావించొద్దన్న ఆర్డర్ వేసింది.