EntertainmentLatest News

సినీ నటుడు రఘుబాబు కార్ ఆక్సిడెంట్.. స్పాట్ లోనే చనిపోయిన బిఆర్ఎస్ నాయకుడు.!


సినీ నటుడు రఘుబాబు కార్ ఆక్సిడెంట్.. స్పాట్ లోనే చనిపోయిన బిఆర్ఎస్ నాయకుడు.!

నల్గొండ జిల్లాలో ఒక పెను సంఘటన జరిగింది. మిర్యాలగూడ రోడ్ లోని అద్దంకి,నార్కేట్ పల్లి ఎన్ హెచ్ హైవే పై బైక్ మీద   వెళ్తున్న ఒక వ్యక్తి ని  అదే రోడ్ లో వస్తున్న బి ఎమ్ డబ్ల్యు కారు  ఢికొట్టిందీ. ఈ  ఘటనలో బైక్ పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడికే చనిపోయాడు

ఇక చనిపోయిన వ్యక్తి పేరు జనార్ధన రావు. ఈయన నల్గొండ జిల్లా బిఆర్ఎస్( (brs)  ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్నాడు. బిఎమ్ డబ్ల్యు కారు ప్రముఖ సినీ నటుడు రఘుబాబు(raghubabu) ది. ప్రమాద సమయంలో ఆయన కారులోనే ఉన్నారు. కాకపోతే  డ్రైవర్ కారుని నడుపుతున్నట్టుగా తెలుస్తుంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.ఇక  రఘుబాబు  తెలుగు ప్రేక్షకుల అందరకి సుపరిచితమే. సీనియర్ నటుడు గిరిబాబు నట వారసుడుగా సినీ రంగ ప్రవేశం చేసి ఎన్నో  సినిమాల్లో నటించాడు.

కొంత మంది ప్రత్యక్ష సాక్షులు మాత్రం రఘుబాబు తప్పు లేదని చెప్తున్నారు.  జనార్ధనరావు బైక్ పై చాలా వేగంగా వచ్చి కారుని ఢీకొట్టాడని అంటున్నారు.ఆ తర్వాత కారు బైక్ ని 50 మీటర్ల దూరం లాక్కెళ్లిందని కూడా చెప్తున్నారు. జనార్దన రావు స్వస్థలం నకరికేల్ మండలంలోని మంగళంపల్లి గ్రామం.ఆయనకి భార్య కుమారుడు కుమార్తె ఉన్నారు. బిఆర్ ఎస్ నాయకత్వం, పలువురు నాయకులు, కార్యకర్తలు జనార్ధన రావు మృతి పట్ల తమ సంతాపాన్ని తెలియచేస్తున్నారు 



Source link

Related posts

Trend Forecasting Case Study – Lufthansa Innovation Hub

Oknews

YCP needs MPs.. Please come! వైసీపీకి ఎంపీలు కావలెను.. ప్లీజ్ రండి!

Oknews

Ustaad Bhagat Singh is here ఉస్తాద్ భగత్ సింగ్ ఊపిరి పోసాడు

Oknews

Leave a Comment