ByGanesh
Thu 18th Apr 2024 09:49 AM
కమెడియన్ రఘుబాబు యాక్సిడెంట్ కేసులో ఇరుక్కున్నారు. ఆయన ప్రయాణిస్తున్న కారు ఓ బైక్ ని ఢీ కొట్టడంతో బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందడంతో రఘుబాబు పై పోలీస్ లు కేసు నమోదు చేసారు. రఘుబాబు కారు అతివేగంతో ప్రయాణిస్తూ ఎదురుగా వెళుతున్న బైక్ ని వెనకనుండి ఢీ కొట్టి ఆ బైక్ ని 50 మీటర్ల వరకు లాక్కెళ్లడంతో బైక్ పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్లుగా స్థానికులు చెబుతున్నారు.
మృతుడు నల్గొండ జిల్లా శ్రీనగర్ కాలనీకి చెందిన సందినేని జనార్ధన్ రావు బీఆర్ఎస్ నాయకుడిగా తెలుస్తోంది. నిన్న బుధవారం మధ్యాహ్న సమయంలో రఘుబాబు స్వయంగా కారు డ్రైవ్ చేస్తూ హైదరాబాద్ నుంచి మిర్యాలగూడ వైపు వెళ్తూ జనార్దన్ బైక్ ని వెనక వైపు నుంచి బలంగా ఢీ కొట్టడమే కాకుండా కారు స్లో చేయకపోవడంతో రఘుబాబు కారు బైక్ పై ఉన్న జనార్దన్ ని 50 మీటర్ల వరకు లాక్కెళ్లడంతో అతను అక్కడికక్కడే మృతి చెండం కలకలం సృష్టించింది.
జనార్ధన్ రావు భార్య ఫిర్యాదు మేరకు రఘుబాబుపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆ తర్వాత రఘుబాబు కి పూచీకత్తుపై షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు.
BRS Leader Killed Hitting Popular Actor Car:
Motorcyclist Hit Actor Raghu Babu Car Dies On The Spot