GossipsLatest News

పవన్ కు ఇవ్వకపోతే నీకిస్తారా మహేష్ ?


పవన్ కళ్యాణ్ తనకి జనసేన పార్టీ తరపున సీట్ ఇవ్వని కారణంగా పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ 2024 ఎన్నికల్లో హైలెట్ అవ్వాలని చూసిన మహేష్ పోతిన కి పవన్ కళ్యాణ్, జనసేన నేతలు భారీ మెజారిటీలతో గెలిచి షాకిచ్చారు. పవన్ కళ్యాణ్ భార్యలపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన మహేష్ కి పవన్ ఫ్యాన్స్ ఇచ్చిన షాక్ అంతా ఇంతా కాదు. 

అయినప్పటికీ మహేష్ పోతిన ఇంకా ఇంకా పవన్ కళ్యాణ్ వెంట పడుతున్నాడు. పవన్ కళ్యాణ్ కి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడం పై మీడియా ముందు మహేష్ పోతిన మరోసారి ఫైర్ అయ్యాడు. 

పవన్ కళ్యాణ్ కు డెప్యూటీ సీఎం పదవి ఇవ్వడం SC, ST, BC, Minorities ని మోసం చెయ్యడమే

కూటమి ప్రభుత్వంలో సామాజిక న్యాయం ఎక్కడుంది?

మీ మొదటి సంతకమే సామాజిక మోసంపై చేశారు

వైయస్ జగన్ గారు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, కాపులకు పది ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చి ఆ సామాజికవర్గ గౌరవాన్ని పెంచారు.. ఏ విధంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ కి ఒక్కడికే డిప్యూటీ సీఎం పదవి ఇస్తారంటూ మహేష్ పోతిన పవన్ పై చేసిన కామెంట్స్ చూసిన పవన్ ఫ్యాన్స్ మరి జనసేన కోసం కష్టపడి.. కూటమి ప్రభుత్వంలోకి రావడానికి ఎంతో శ్రమించిన పవన్ కళ్యాణ్ కి డిప్యూటీ ఇవ్వకపోతే నీకిస్తారా మహేష్ అంటూ మహేష్ ని ట్రోల్ చేస్తున్నారు. 



Source link

Related posts

ఎన్నాళ్లకెన్నాళ్లకు.. ఓటీటీలోకి అఖిల్ 'ఏజెంట్'!

Oknews

Ram Mandir | అయోధ్య రామ మందిరంలో కాకతీయుల టెక్నాలజీ ఎలా ఉపయోగించారో తెలుసా..!

Oknews

Adilabad To Pragathi Bhavan Aadivaasi Padayatra: వీరి డిమాండ్లు ఏంటి..? పాదయాత్ర ఎందుకు?

Oknews

Leave a Comment