సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ తీవ్ర అస్వస్థతకు (Rajinikanth Health Update) గురయ్యారు. దీంతో ఆయన హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని అపోలో ఆసుపత్రిలో ( Jubilee Hills Apollo Hospital) చేరారు. ఆసుపత్రిలో రజనీకి తోడుగా ఆయన కుమార్తె ఐశ్యర్య ఉన్నారు. చికిత్సలో ఆయనకు కరోనా నెగెటివ్ అని తేలింది. ప్రస్తుతం ఆయన సినిమా ‘అన్నాత్తే’ (Rajinikanth Annaatthe Movie) షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఈ సినిమాను సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ప్రొడక్షన్ సభ్యులకు టెస్టులు నిర్వహించగా ఎనిమిది మందికి కరోనావైరస్ సోకినట్టు తేలింది.
రజనీ అస్వస్థతకు గురయ్యారని తేలడంతో ఆయన అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మరోవైపు కాసేపటి క్రితం రజనీ ఆరోగ్యంపై అపోలో ఆసుపత్రి వైద్యులు బులెటిన్ విడుదల చేశారు.’ఈ ఉదయం రజనీకాంత్ ఆసుపత్రిలో చేరారు. గత 10 రోజులుగా ఆయన హైదరాబాదులో షూటింగ్ లో పాల్గొంటున్నారు. 22వ తేదీన సెట్స్ లో ఉన్న కొందరికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అదే రోజున చేసిన టెస్టులో రజనీకి నెగెటివ్ వచ్చింది. అయినప్పటికీ అప్పటి నుంచి ఆయన స్వీయ నిర్బంధంలో ఉన్నారు. వైద్యులు ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షించారు.
రజనీకాంత్ లో కరోనా లక్షణాలు లేనప్పటికీ… బీపీ స్థాయుల్లో భారీ హెచ్చుతగ్గులు ఉన్నాయి. ఐతే శుక్రవారం ఉదయం ఒక్కసారిగా బీపీ పెరగడంతో ఆయన అపోలో ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. రజినీకాంత్ ఆరోగ్య పరిస్థితిని ప్రత్యేక బృందం మానిటర్ చేస్తుందని.. బీపీలో హెచ్చుతగ్గులను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని అపోలో డాక్టర్లు తెలిపారు. బీపీ అదుపులోకి రాగానే డిశ్చార్జి చేస్తామని ప్రకటించింది.
బీపీ పూర్తి స్థాయిలో అదుపులోకి వచ్చేంత వరకు ఆయనను వైద్య బృందం పర్యవేక్షిస్తుంది. బీపీ మినహా ఆయనలో ఇతర ఆరోగ్య సమస్యలు లేవు’ అని బులెటిన్ లో వైద్యులు తెలిపారు. మరోవైపు, రజనీ అస్వస్థతకు గురయ్యారని తెలియగానే, ఆయన అభిమానులు అపోలో ఆసుపత్రి వద్దకు చేరుకుంటున్నారు.
ప్రస్తుతం రజినీకాంత్ అన్నాత్తే సినిమాలో నటిస్తున్నారు. కీర్తి సురేష్, నయనతార హీరోయిన్‌గా నటిస్తున్నారు. మీనా, కుష్బూ, ప్రకాశ్ రాజ్, జాకీ ష్రాఫ్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. శివ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీని.. సన్ పిక్చర్స్ అన్నాత్తే మూవీని నిర్మిస్తోంది. డి. ఇమ్మన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే మూవీ షూటింగ్ పూర్తి కావాల్సింది. కానీ కరోనా కారణంగా చాలా రోజుల పాటు షూటింగ్‌కు నిలిచిపోయాయి. ప్రస్తుతం కరోనా అదుపులోకి రావడం, షూటింగ్‌లకు ప్రభుత్వాలు అనుమతివ్వడంతో.. అన్నాత్తే చిత్రీకరణ మళ్లీ పట్టాలెక్కింది. ఐతే మూవీ యూనిట్‌లో కొందరికి కరోనా రావడం, ఇప్పుడు రజినీకాంత్ అనారోగ్యానికి గురవడంతో.. అన్నాత్తే షూటింగ్‌కు మరోసారి బ్రేకులు పడ్డాయి.
ఇక తమిళనాడులో రజినీకాంత్ రాజకీయ అరంగ్రేటానికి సిద్ధమవుతున్న సంగతి విదితమే . త్వరలోనే పార్టీని ప్రకటించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే పార్టీ పేరు, జెండా, గుర్తులను ఖరారు చేసినట్లు తెలుస్తోంది.