పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి వెళ్ళను అంటే మెగాస్టార్ వైఫ్ సురేఖ గారు మరిదిని ప్రోత్సహించి సినిమా హీరోలాగా ఒక్కసారి చేసి చూడు నచ్చకపోతే వెనక్కి వెచ్చేయమని ప్రోత్సహిస్తేనే ఆయన హీరో అయ్యారు. ఆ విషయాన్ని పవన్ చాలా సందర్భాల్లో చెప్పారు. ఆయనకి అన్న మెగాస్టార్ అన్నా, వదిన సురేఖ అన్నా ప్రత్యేకమైన గౌరవం. ఎంత గౌరవమే అనేది రీసెంట్ గా ఆయన వాళ్ళ కాళ్ళకి సాష్టాంగ నమస్కారం చేసినప్పుడు అందరూ చూసారు.
పవన్ కళ్యాణ్ కోసం సురేఖ గారు కొడుకు రామ్ చరణ్ తో కలిసి పిఠాపురం వెళ్లి ఆయన గెలుపు కోసం ప్రత్యేక పూజలు చేసారు. పవన్ గెలిచాక ఎమ్యెల్యే హోదాలో అన్నా – వదిన కాళ్ళకి నమస్కారం చేసారు, ఆ వీడియో చూసిన వాళ్లకి ఒళ్ళు పులికించిపోయింది. పవన్ అన్నా – వదినలకి ఇచ్చిన గౌరవాన్ని ఇస్తున్న గౌరవం అందరికి తెలిసిందే.
ఇక పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు. అంతేకాదు పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు పవన్ వద్దకి వచ్చి చేరాయి. ఇక పవన్ కళ్యాణ్ కి ఈరోజు వదినమ్మ సురేఖ గారు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన వీడియో ని మెగాస్టార్ సోషల్ మీడియాలో షేర్ చేసారు.
పవన్ కళ్యాణ్ కోసం సురేఖ గారు స్పెషల్ గా ఫౌంటెన్ పెన్ ను తన మరిదికి బహూకరించారు. వదినమ్మ నుంచి అందిన స్పెషల్ గిఫ్ట్ చూసి పవన్ కల్యాణ్ అమితానందం వ్యక్తం చేశారు. పవన్ దానిని అందుకుని సురేఖ గారిని ప్రేమతో హగ్ చేసుకున్న వీడియో లో చిరు, అన్న లెజెనోవా లు చివరిగా వచ్చి ఫొటోలకి ఫోజులిచ్చారు.