తెలంగాణలో వర్షాలు
ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న తెలంగాణ ప్రజలు హైదారాబాద్ వాతావరణ కేంద్రం కూల్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో రానున్న నాలుగు రోజులు వానలు పడే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని తెలిపింది. ద్రోణి కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వానలు పడే అవకాశం ఉందని తెలిపింది. రాయలసీమ నుంచి మధ్య బంగాళాఖాతం వరకు సముద్రమట్టానికి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తన ద్రోణి విస్తరించి ఉందని తెలిపింది. దీంతో ఆదివారం కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, వరంగల్, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి హన్మకొండ, జనగాం, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడనున్నాయని వెల్లడించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.