Entertainment

bollywood-actor Ashiesh Roy Passed Away


Ashiesh Roy Passed Away: మరో బాలీవుడ్ నటుడు ఆశిష్ రాయ్ కన్నుమూత

గత కొన్ని రోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న బాలీవుడ్‌ నటుడు ఆశిష్‌ రాయ్(55) మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఆయన ఇంట్లో పనిచేసే సిబ్బంది ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ‘‘ఉదయం 3.45 నిమిషాల ప్రాంతంలో ఆయన కుప్పకూలిపోయారు. గత కొన్ని నెలలుగా డయాలసిస్‌ జరుగుతోంది. ఆరోగ్య పరిస్థితి కాస్త కుదుటపడింది అనుకునేలోపే ఇలా జరిగిపోయింది. ఆయన సోదరి కోల్‌కతా నుంచి సాయంత్రం ఇక్కడికి వస్తారు. అప్పుడే అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతాయి’’ అని పేర్కొన్నారు.

ఆశిష్‌ రాయ్‌‌కు గత కొన్ని నెలలుగా డయాలసిస్‌ జరుగుతోంది. సినీ, టీవీ ఆర్టిస్టు అసోసియేషన్‌ ఆశిష్‌ రాయ్‌ మృతిపై సంతాపం వ్యక్తం చేశారు. ఫిల్మ్‌ మేకర్‌ హన్సల్‌ మెహతా, అశ్విని చౌదరి సహా నటులు సూరజ్‌ థాపర్‌, ఆసిఫ్‌ తదితరులు సోషల్‌ మీడయా వేదికగా నివాళులు అర్పించారు. 

కాగా, కిడ్నీ సమస్యతో ఆస్పత్రిలో చేరిన ఆశిష్‌ రాయ్‌‌ను బిల్లు కట్టలేదన్న కారణంగా ఈ ఏడాది జూన్‌లో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేశారు. అప్పటి నుంచి ఇంట్లోనే ఉంటున్న ఆశిష్‌ రాయ్‌.. పెద్ద మనసుతో తనను ఆదుకోవాల్సిందిగా అభిమానులు, సెలబ్రిటీలకు విజ్ఞప్తి చేశారు. తన వద్ద డబ్బు లేదని, కానీ బతకాలని ఉందంటూ తన దీనస్థితిని వివరించారు. సల్మాన్‌ ఖాన్‌ వంటి అ‍గ్ర నటులను కూడా సాయం కోసం అర్థించానని, అయినా ఫలితం లభించలేందంటూ గతంలో ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆశిష్‌ చెప్పుకొచ్చారు.

ఫిల్మ్‌ మేకర్‌ హన్సల్‌ మెహతా, అశ్విని చౌదరి సహా నటులు సూరజ్‌ థాపర్‌, ఆసిఫ్‌ షేక్‌, టినా ఘాయ్‌ తదితరులు సోషల్‌ మీడియా వేదికగా ఆయనకు నివాళులు అర్పించారు. పలు సినిమాల్లో నటించిన ఆశిష్‌ రాయ్‌.. బనేగీ అప్నీ బాత్‌, ససురాల్‌ సిమర్‌ కా, కుచ్‌ రంగ్‌ ప్యార్‌ కే ఐసే భీ వంటి హిందీ హిట్‌ సీరియల్స్‌లో కనిపించి బుల్లితెర ప్రేక్షకులను అలరించారు. 
 

 



Source link

Related posts

mahesh babu new movie Maharshi teaser

Oknews

లేట్ వయసులో జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్నాడు!

Oknews

లెనిన్ గా అక్కినేని అఖిల్!

Oknews

Leave a Comment