Entertainment

naga-chaitanya-birthday-love-story-special-poster – Telugu Shortheadlines


Love Story Movie: పల్లెటూరి కుర్రాడు గెటప్‌లో నాగచైతన్య 

అక్కినేని నాగ చైతన్య  హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ”లవ్ స్టోరి” స్పెషల్ పోస్టర్‌ను చైతూ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. లుంగీ, బనియన్‌తో  పల్లెటూరి యువకుడి పాత్రలో నాగ చైతన్య  లుక్  అభిమానులను ఆకట్టుకుంటోంది. కొందరితో స్నేహాలు చాలా బావుంటాయి.  చైతూతో అసోసియేషన్ అలాంటిదే.. థ్యాంక్యూ.. హ్యాపీ బర్త్ డే చైతన్య” అంటూ ‘లవ్ స్టోరి”  చిత్ర దర‍్శకుడు శేఖర్ కమ్ముల  చేకు శుభాకాంక్షలు  తెలిపారు.

 నాగ చైతన్యకు జోడిగా సాయిపల్లవి నటిస్తోంది. రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పవన్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు నాగ చైతన్య  తన శ్రీమతి, టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంతా అక్కినేనితో  కలిసి మాల్దీవుల్లో విహారయాత్రలో ఉన్నారు. 

అయితే తన హబ్బీ పుట్టినరోజు సందర్భంగా, సమంతా బీచ్‌లో ఎంజాయ్‌  చేస్తున్న అద్భుతమైన  ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్  స్టోరీలో  షేర్‌ చేశారు.  అంతకుముందు స్కూబా డైవింగ్ కోసం సిద్ధమవుతున్న ఫోటోలను ఆమె సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు.

 



Source link

Related posts

నేను చనిపోయానని అనుకున్నారు..

Oknews

ఒక పథకం ప్రకారం.. 5 గురు నేషనల్ అవార్డు విన్నర్స్

Oknews

వైజాగ్ కోసం అన్ని కోట్లా.. మెగా హీరో ఏం చేస్తున్నాడు..?

Oknews

Leave a Comment