Entertainment

Tamil Actor Thavasi, Suffering from Cancer seeks financial aid for treatment


Tamil Actor Thavasi: తమిళ నటుడికి క్యాన్సర్, ఆదుకోవాలని వినతి

తమిళ నటుడు తవసి (Tamil Actor Thavasi) క్యాన్సర్ బారీన పడిన సంగతి విదితమే. కొంత కాలంగా క్యాన్సర్‌ చికిత్స తీసుకుంటున్న తమిళ కమెడియన్ తవసి ఆర్థికంగా బాగా చితికిపోయారు. అటు ఆరోగ్యం, ఇటు ఆర్థికంగానూ కుదేలైన తవసి చాలా సన్నబడిపోయారు. గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. తండ్రి చికిత్సకు ఆర్థికంగా తమను ఆదుకోవాలంటూ ఆయన కుమారుడు అరుముగన్‌ కోలీవుడ్‌ పెద్దలను అభ్యర్థించారు. 

ఈ క్రమంలో నడిగర్ సంఘం స్పందించింది. తవసికి సాయం చేసేందుకు ముందుకు రావాలని సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా అర్థించింది. తన కామెడీతో నవ్వులు పూయించిన తవసి దీనస్థితి చూసి అభిమానులు షాక్‌కి గురవుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని కామెంట్లు చేస్తున్నారు. తోచినంత సాయం చేస్తామని ముందుకొస్తున్నారు.

కొన్నాళ్ల కింద తావసికి క్యాన్సర్ (Thavasi Suffering from Cancer, Disease) వచ్చినట్లు వైద్యులు గుర్తించారు. దాంతో ఒకప్పుడు చాలా దృఢంగా ఉన్న ఈ నటుడు కొన్నాళ్లలోనే ఎముకల గూడులా మారిపోయాడు. ఆయన్ని గుర్తించడానికి కూడా చాలా సమయం పడుతుంది. ఎవరైనా వచ్చి ఇతడే అని చెప్తే తప్ప తావసిని గుర్తించలేని పరిస్థితుల్లోకి వెళ్లిపోయాడు. అతడి చికిత్స కోసం లక్షల్లో ఖర్చవుతున్న నేపథ్యంలో తావసి కుమారుడు అర్ముగం ఆదుకోవాలంటూ చిత్ర పరిశ్రమకు విజ్ఞప్తి చేశాడు. ఈయన పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.

శివ కార్తికేయన్ నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘వరుత్తపడతా వాలిబర్ సంగం’లో తావసి నటనకు మంచి మార్కులు పడ్డాయి. అక్కడ్నుంచి ఆయనకు చాలా సినిమాల్లో ఆఫర్స్ వచ్చాయి. ముఖ్యంగా చాలా సినిమాల్లో ఈయన పూజారి, జ్యోతిష్యుల పాత్రలతోనే అలరించాడు. ఇప్పుడాయన ఆసుపత్రిలో సాయం కోసం దీనంగా వేచి చూస్తున్నాడు. అయితే ఆయనకు అండగా ఉంటానని ఇప్పటికే హీరో శివ కార్తికేయన్ ప్రకటించాడు. వైద్యం కోసం తాను ముందుకొస్తానని.. కుటుంబాన్ని ధైర్యంగా ఉండాలని సూచించాడు. ఈయన త్వరగా కోలుకోవాలని తమిళ నటులు కూడా కోరుకుంటున్నారు
 

 



Source link

Related posts

బాలీవుడ్‌ సినిమాటోగ్రాఫర్‌ను పెళ్లాడిన టాలీవుడ్‌ హీరోయిన్‌!

Oknews

బ్రేకింగ్.. పవన్ కళ్యాణ్ కోసం మహిళ ఆత్మహత్యాయత్నం!

Oknews

ఆట మొదలైంది.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో సినీ ప్రముఖుల భేటీ!

Oknews

Leave a Comment