GossipsLatest News

పవన్‌కు వదిన ఇచ్చిన గిఫ్ట్ ఖరీదు ఎంతంటే..?


ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ హైదరాబాద్ విచ్చేయగా అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి, వదిన సురేఖలు అదిరిపోయే పెన్ బహుమతిగా ఇచ్చారు. పెన్ అదిరిపోగా.. ఇందుకు సంబంధించిన వీడియోను మెగా ఫ్యామిలీ రిలీజ్ చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన మెగాభిమానులు, జనసేన కార్యకర్తలు, అనుచరులు ఆనందంలో మునిగి తేలుతున్నారు. మరిది అంటే వదినమ్మకు ఎంత ప్రేమో అంటూ జనసైనికులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఐతే.. అసలు ఈ పెన్ ఖరీదు ఎంత..? ఎన్ని లక్షల రూపాయల్లో ఉండొచ్చు..? ఇంతకీ లక్షలా.. కోట్లా అని తెలుసుకోవడానికి గూగుల్ చేస్తున్నారు.

ఇంతకీ ఖరీదు ఎంత..?

మరిదికి వదినమ్మ ఇచ్చిన పెన్ మోంట్ బ్లాంక్ వాల్ట్ డిస్నీ కంపెనీకి చెందినది. ఈ కంపెనీకి చెందిన పెన్నులు ఖరీదు ఎక్కువ. తక్కువలో తక్కువ.. రూ. 90 వేల నుంచి రూ. 2.60 లక్షల వరకూ ఉన్నాయి. ఇందులో బాల్ పాయింట్ పెన్నులు ఒక రేటు.. ఫౌంటేన్ పెన్నులు మరో రేటు ఉన్నాయ్. ఐతే కొన్ని వెబ్ సైట్లలో చెక్ చేయగా.. అక్షరాలా రూ. 3,50,000 పై చిలుకు విలువ చేసే ఖరీదైనదిగా గూగుల్ చెబుతోంది. ఎంతైనా ఉప ముఖ్యమంత్రి కదా.. ఆ మాత్రం ఉండటంలో తప్పేముంది అని అభిమానులు చెబుతున్నారు.

ఇక సంతకాలే..!

కాగా ఏపీ ఎన్నికల్లో సూపర్ విక్టరీ కొట్టిన కూటమి.. జూన్ 12న నారా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగా.. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా, ఇతర మంత్రులు దైవ సాక్షిగా ప్రమాణం చేశారు. ఇక సేనానికి.. ఏపీ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా, పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను చంద్రబాబు కేటాయించారు. ప్రమాణ తర్వాత తొలిసారిగా హైదరాబాద్ వచ్చిన పవన్.. అన్నయ్య ఇంటికి వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా వదిన సురేఖ స్పెషల్ గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. ఈ బహుమతి గురుంచి ఇప్పుడు అటు మీడియాలో.. ఇటు సోషల్ మీడియాలో ఎటు చూసినా పెన్ గురించే చర్చ జరుగుతోంది.





Source link

Related posts

బాలీవుడ్ హీరోయిన్ మెహిందీ వేడుకలు

Oknews

ఒక పథకం ప్రకారం.. 5 గురు నేషనల్ అవార్డు విన్నర్స్

Oknews

Investigation completed Navdeep comments go viral విచారణ పూర్తి నవదీప్ కామెంట్స్ వైరల్

Oknews

Leave a Comment