Entertainment

Telugu Hero Chiranjeevi Tests Positive For COVID-19


Chiranjeevi Tests Positive for Corona: హీరో చిరంజీవికి కరోనా పాజిటివ్, రెండు రోజుల క్రితం కేసీఆర్ ని కలిసిన మెగాస్టార్ 

తెలుగు సినిమా మెగాస్టార్‌ చిరంజీవి కోవిడ్ బారినపడ్డారు. ఆచార్య సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు కోవిడ్‌ పరీక్ష చేయించుకోగా ఆయనకు కోవిడ్ పాజిటివ్‌గా (Chiranjeevi Tests Positive for Covid) నిర్ధారణ అయిది. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవి ట్విటర్‌ వేదికగా తెలిపారు. ఆచార్య షూటింగ్ (Acharya) ప్రారంభించాలని, కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాను. రిజల్ట్ పాజిటివ్ వచ్చింది. నాకు (Telugu Hero Chiranjeevi) ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేవు. వెంటనే  హోమ్  క్వారంటైన్ అయ్యాను. గత 4-5 రోజులుగా నన్ను కలిసినవారందరిని టెస్ట్ చేయించుకోవాలిసిందిగా కోరుతున్నాను.ఎప్పటికప్పుడు నా ఆరోగ్య పరిస్థితిని మీకు తెలియచేస్తాను’అని చిరంజీవి పేర్కొన్నారు. 

అయితే చిరంజీవి సోదరుడు, నటుడు నాగబాబుకు కూడా ఆ మధ్యన కరోనా సోకగా.. ఆయన కోలుకున్నారు. కాగా రెండు రోజుల క్రితం చిరంజీవి, నాగార్జున ఇద్దరు ముఖ్యమంత్రి కేసీఆర్‌ని కలిసిన విషయం తెలిసిందే. ఇక ఇవాళ్టి నుంచి ఆచార్య షూటింగ్ తిరిగి ప్రారంభం కావాల్సి ఉండగా.. చిరుకు కరోనాతో మళ్లీ వాయిదా పడింది. కాగా, రెండు రోజుల క్రితం ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి వరద సాయం అందించారు. ఆయన వెంట హీరో నాగార్జున కూడా ఉన్నారు. నిన్న (ఆదివారం) టీఆర్‌ఎస్‌ ఎంపీ సంతోష్‌కుమార్‌, తన తనయుడు రామ్‌చరణ్‌తో చిరంజీవి సెల్ఫీ దిగారు.

 





Source link

Related posts

‘దేవర’ వీడియో లీక్.. షాక్ లో మూవీ టీమ్!

Oknews

నా భార్య నన్ను వేధిస్తుంది..కంప్లైంట్ చేసిన ప్రముఖ నటుడు

Oknews

నాగార్జున హీరోయిన్ భారీ వర్క్ అవుట్స్ ..చిరంజీవి సినిమా కోసమేనా 

Oknews

Leave a Comment