దిశ, ఫీచర్స్: ఇటీవల కాలంలో చాలామంది అందానికి ఇచ్చినంత ఇంపార్టెన్స్ దేనికి కూడా ఇవ్వడం లేదు. అందమైన చర్మం కోసం, ఆడ, మగ అని తేడా లేకుండా అనేక రకాల ప్రయోగాలు చేస్తూ అందంగా ఉండేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మార్కెట్‌లోనూ స్కిన్‌కు సంబంధించిన రకరకాల క్రీమ్స్ అందుబాటులోకి రావడం విపరీతంగా వాడుతున్నారు. ముఖ్యంగా బ్యూటీ పార్లర్స్ వచ్చిన కానుంచి ఎన్నో ఫేషియల్స్ రావడంతో సెలబ్రిటీలే కాకుండా సాధారణ జనాలు కూడా చేయించుకుంటున్నారు.
వయసుతో సంబంధం లేకుండా బ్యూటీపార్లర్‌లో వేయిలకు వేలు ఖర్చు పెడుతూ అందంగా రెడీ అవుతున్నారు. అయితే రోజుకో ఫ్యాషన్ అందుబాటులోకి వస్తూ జనాలను ట్రెండ్‌కు తగ్గట్లు మార్చేస్తున్నాయి. తాజాగా, ఓ బ్యూటీ ట్రెండ్‌కు సంబంధించిన వార్త నెట్టింట వైరల్ అవుతోంది. బర్డ్ పూప్ ఫేషియల్‌ను జనాలు ఖరీదైనా కానీ ఎగబడి చేయించుకుంటున్నారట. బర్డ్ పూప్ అంటే పక్షి రెట్ట. దీనిని జపాన్, చైనా, ఆసియా దేశాల్లోని జనాలు విపరీతంగా చేయించుకుంటున్నారని సమాచారం. పక్షి రెట్టతో ముఖం అందం పెంచడానికి కొన్ని బ్యూటీ పార్లర్స్ వారు ఉపయోగిస్తున్నారు. అయితే ఈ ఫేషియల్ కోసం అన్ని పక్షుల రెట్టలను వాడరు. కేవలం కోయిల మలంనే వాడుతారు. దీని వల్ల చర్మానికి ప్రయోజనాలుంటాయని అక్కడి జనాలు నమ్ముతున్నారు.
దీనిని ఎలా తయారు చేస్తారంటే.. కోయిల రెట్టలో వరి పిండి కలుపుతారు. దానిలో కొంత నీరు కలిపి ముఖానికి అప్లై చేస్తారు. అది ఆరిపోయిన తర్వాత గోరు వెచ్చని నీటితో కడుగుతారు. దీంతో ముఖంగా అందంగా కనిపిస్తుంది. అయితే ఈ ఫేషియల్‌ను హాలీవుడ్ నటుడు టామ్ క్రూజ్ కూడా చేయించుకున్నట్లు టాక్. దీని వల్ల ఎంజైమ్‌లు, మృత చర్మ కణాలను తొలగించడంతో సహాయపడతాయి. అలాగే ముడతలు తొలగిపోతాయి. అంతేకాకుండా రక్త ప్రసరణ కూడా మెరుగుపడుతుందని అక్కడి జనాలు అంటున్నారు. ప్రస్తుతం ఇదే వార్త నెట్టింట వైరల్ కావడంతో.. ఈ విషయం తెలిసిన వారంతా షాక్ అవుతున్నారు. ఇదేం ట్రెండ్ ఛీ ఛీ పక్షి రెట్టతో ఫేషియల్ చేయించుకోవడం ఏంటనీ పలు రకాలుగా చర్చించుకుంటున్నారు.