ByGanesh
Sun 16th Jun 2024 05:32 PM
కన్నడ స్టార్ హీరో దర్శన్ ప్రేయసి పవిత్ర గౌడ్ కోసం అభిమానిని హత్య చేసిన కేసులో ఊచలు లెక్కబెడుతున్నాడు. అతనితో పాటుగా ఈ హత్య కేసులో ఇన్వాల్వ్ అయిన మరో నలుగురు నిందితులు ప్రస్తుతం పోలిసుల అదుపులో ఉన్నారు. నటి పవిత్ర గౌడ్ కి దర్శన్ అభిమాని రేణుక చౌదరి అసభ్యకరమైం మెసేజెస్ పంపించిన కారణంగా పవిత్ర గౌడ్.. దర్శన్ ని రేణుక చౌదరి మీదకి ఉసి గొల్పగా.. దర్శన్ మరో నలుగుర్ని రేణుక చౌదరిని హత్య చేసేందుకు పురమాయించాడు.
ఆ నాలుగురు రేణుక చౌదరిని కారులో కిడ్నాప్ చేసి ఓ షెడ్డులో బందించి రేణుక చౌదరిని హింసించి చంపేసినట్టుగా పోలీసులు ఆధారాలతో సహా కనుగొన్నారు. దర్శన్ కారు డ్రైవర్ తో సహా అందరూ పోలీసులకి చికారు. అయితే ఆ నిందితుల్లో ఒకరైన అనుకుమార్ తండ్రి ఈ శుక్రవారం నైట్ గుండెపోటుతో మరిణించాడు.
అనుకుమార్ అరెస్ట్ అయ్యి స్టేషన్ లో ఉన్నప్పటి నుంచి అతని తండ్రి డిప్రెషన్ లకి వెళ్లి ఆహారం తీసుకోవడం మానెయ్యడంతో అతనికి శుక్రవారం, హార్ట్ స్ట్రోక్ రావడంతో వెంటనే అతను చనిపోయినట్లుగా తెలుస్తుంది. అయితే అనుకుమార్ ఫ్యామిలీ సభ్యులు అనుకుమార్ వస్తే కానీ బాడీని తియ్యమని పట్టుబట్టడంతో బెంగళూరు పోలీసులు శనివారం అర్థరాత్రి కోర్టు అనుమతి తీసుకుని అనుకుమార్‌ను చిత్రదుర్గకు తీసుకొచ్చారు.
శనివారం అదనపు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు దర్శన్ అతడి 12 మంది సహాయకులకు పోలీసు కస్టడీని మరో ఐదు రోజులు పొడిగించింది.
Father Of Accused In Actor Darshan Murder Case Dies:
The father of Anukumar, who is accused number seven in the FIR