Entertainment

narthanasala shelved-project-to-release-on-dussehra – Telugu Shortheadlines


Narthanasala: విడుదలకు సిద్ధమైన బాలకృష్ణ, సౌందర్య నర్తనశాల ఓటీటీ

 బాలకృష్ణ (Narthanasala, Balakrishna) దర్శకత్వం వహించాలనుకున్న ‘నర్తనశాల’ సినిమా మధ్యలో ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అర్జునిడిగా బాలయ్య నటించగా, భీముడిగా శ్రీహరి , ధర్మరాజుగా శరత్ కుమార్, అభిమన్యుడిగా ఉదయ్ కిరణ్ నటించారు. ఇక ద్రౌపతిగా అందాలనటి సౌందర్య నటించింది.అయితే ఈ సినిమాను కేవలం 17 నిమిషాల పాటు చిత్రీకరించారు.ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే హెలికాఫ్టర్ ప్రమాదంలో సౌందర్య (Late actor Soundarya) మరణించింది. దాంతో సినిమా షూటింగ్‌ను బాలకృష్ణ పక్కన పెట్టేశారు. అయితే అభిమానుల కోరిక మేరకు 17 నిమిషాల నిడివి ఉన్న ఆ సన్నివేశాలను (Narthanasala OTT) ప్రేక్షకుల ముందుకు తీసుకరానున్నట్లు బాలకృష్ణ సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు.

బుధవారం 12.30 గంటలకు సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాలో అర్జునుడు, కృష్ణుడు, ధుర్యోధనుడిగా బాలయ్య త్రిపాత్రాభినయం చేయాలనుకున్నారు. అయితే అనుకోని విధంగా ఏప్రిల్ 17, 2004న ఓ రాజకీయ కార్యక్రమంలో పాల్గొనేందుకు బెంగళూరు నుంచి కరీంనగర్‌కు వెళుతుండగాహెలికాప్టర్‌లో వెళుతూ నటి సౌందర్య ప్రమాదానికి గురై చనిపోయింది.
 
ఆ ప్రమాదంలోనే ఆమె సోదరుడు అమర్‌నాథ్‌ కూడా సజీవ దహనమయ్యిన విషయం తెలిసిందే. సౌందర్య 2004 లో భారతీయ జనతా పార్టీలో చేరారు. దీంతో నర్తశాల మరుగున పడిపోయింది. తాజాగా ప్రేక్షకుల డిమాండ్‌ మేరకు ఇన్నాళ్లకు ఓటీటీ ద్వారా చిత్రంలోని కొన్ని సన్నివేశాలను విడుదల చేయబోతున్నారు.

ఇందులో బాలకృష్ణ మూడు పాత్రలు పోషించారు (అర్జున, బ్రూహన్నాల, మరియు కీచకుడు), సాయి కుమార్ దుర్యోధనుడును పాత్రను చేశారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ ప్రాజెక్టులో అసిన్ ఉత్తర, శరత్ బాబు ధర్మరాజు, కోట శ్రీనివాస రావు విరాటా రాజు, ప్రముఖ దర్శకుడు కె విశ్వనాథ్ కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రం యొక్క ప్రధాన భాగం చిత్రీకరించబడింది.

 



Source link

Related posts

'మథగం 2' వెబ్ సిరీస్ రివ్యూ

Oknews

ఓడిపోవడం మన చరిత్రలోనే లేదు.. ఏం జరిగినా సరే చూసుకుందాం…

Oknews

నాలో సూపర్ పవర్ ఉందనేది నిజం.. జాతీయ మీడియా ముందు ఒప్పుకున్న చరణ్

Oknews

Leave a Comment