ByGanesh
Mon 17th Jun 2024 11:18 AM
సినిమాల్లో హీరోలకి సపోర్టింగ్ కేరెక్టర్స్ చేస్తూ జబర్దస్త్ లో కమెడియన్ గా ఫేమస్ అయిన వేణు.. బలగం చిత్రంతో దర్శకుడిగా మారాడు. ఆ చిత్రం తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కి సూపర్ బ్లాక్ బస్టర్ అవడంతో వేణు పేరు దర్శకుడిగా బాగా మోగిపోయింది. దానితో వేణు నెక్స్ట్ ప్రాజెక్ట్ పై అంచనాలు బాగా పెరిగిపోయాయి. దిల్ రాజు వేణు ని తన బ్యానర్ లోనే సెకండ్ ప్రాజెక్ట్ కి అడ్వాన్స్ ఇచ్చి లాక్ చేసారు.
తర్వాత వేణు తన దగ్గర కథతో హీరో నాని ని తన తదుపరి ప్రాజెక్ట్ కోసం లాక్ చెయ్యడమం, నాని బర్త్ డే రోజున అనౌన్సమెంట్ కూడా ఇప్పించడం జరిగిపోయాయి. ఆ తర్వాత అంటే ఏడాదిగా వేణు-నాని ప్రాజెక్ పై ఎలాంటి అప్ డేట్ లేదు. ఈమధ్యన నాని మరో ప్రాజెక్ట్ కూడా ఆగిపోయింది అనే న్యూస్ తో పాటుగా వేణు తో నాని ప్రాజెక్ట్ కూడా ఆపేశారనే న్యూస్ నడిచింది.
నాని – సుజిత్, నాని-వేణు రెండు ప్రాజెక్ట్స్ ఆగిపోయాయని అంటున్నారు. తాజాగా కథ విషయంలోనే వేణు ప్రాజెక్ట్ నుంచి నాని తప్పుకున్నాడని, మరో మంచి కథ సెట్ అయితే వేణు-నాని కాంబో ప్రాజెక్ట్ ఉంటుంది అంటున్నారు. దీనితో దిల్ రాజు కూడా ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ని హోల్డ్ లో పెట్టారంటున్నారు.
Nani Who Shocked Balagam Venu:
Nani says no to Balagam Venu next