ByGanesh
Mon 17th Jun 2024 09:41 AM
పుష్ప ద రూల్ ఆగష్టు 15 కి పక్కాగా రిలీజ్ అవుతుంది అని పదే పదే చెప్పిన మేకర్స్ ఇప్పుడు వెనక్కి తగ్గే ఆలోచనలో ఉన్నారు. దర్శకుడు సుకుమార్ ఇంకా షూటింగ్ పూర్తి కాలేదు.. 50 రోజుల షూటింగ్ బాలన్స్ ఉంది.. అంటే ఆగస్టు వరకు పుష్ప 2 షూటింగ్ పూర్తి కాదు.. రిలీజ్ సాధ్యం కాదు అంటున్నారట.
హీరో అల్లు అర్జున్ కి సినిమా వాయిదా విషయం చెప్పకుండా నిర్మాతలతో డిస్కర్స్ చేస్తున్నారట సుకుమార్. మరోపక్క అల్లు అర్జున్ ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టు 15 నే సినిమా రావాలంటున్నారట. హీరోకి దర్శకుడికి సర్దిచెప్పలేక నిర్మాతలు టెన్షన్ పడిపోతున్నారట. దర్శకుడు సుకుమార్, హీరో అల్లు అర్జున్ మద్యన నిర్మాతలు నలిగిపోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
పుష్ప 2 షూటింగ్ 50 డేస్ పైనే పడుతుంది. ఇంకా పోస్ట్ ప్రొడక్షన్, CG వర్క్ బాలన్స్ వుంటుంది. సుకుమార్ అండ్ టీమ్ ప్రస్తుతానికి మూడు యూనిట్లు గా విడిపోయి వర్క్ చేస్తున్నారు. రెండు యూనిట్లు రామోజీ ఫిలిం సిటీ లో మరో యూనిట్ మారేడుమిల్లి లో షూటింగ్ నిర్విరామంగా చేసున్నారట.
చెప్పిన డేట్ కి అంటే ఆగష్టు 15 కే రావాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారట. కానీ ఆ డేట్ కి సినిమా రెడీ అవ్వడం కష్టమే అని కొందరు అంటున్నారు. మరి ఈ విషయాన్ని మేకర్స్ ఎప్పటికి తెలుస్తారో అని అందరూ తెగ ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూస్తున్నారు.
Pushpa 2 : What is happening:
Pushpa 2, Starring Allu Arjun, Rashmika Mandanna, Postponed, Not To Release On August 15