అందంతో ప్రేక్షకుల మనసు దోచుకోవడమే కాదు.. తన మంచి మనసుతో ఎంతో మందికి సేవ చేయగలనని నిరూపించింది కేరళ హీరోయిన్. కరోనా బాధితులను ఆదుకునేందుకు ఎంతో మంది సెలబ్రెటీలు ముందుకు వస్తున్నారు. హీరోయిన్ నిఖిలా విమల్ తన వంతుగా సాయం చేస్తోంది. కరోనా సమయంలో నిస్సహాయుల కోసం కాల్ సెంటర్‌లో పని చేస్తూ అభాగ్యులకు అండగా నిలుస్తోంది. ఎవరైన ప్రభుత్వ సాయం పడిన వారు ఫోన్ చేయగానే వెంటనే స్పందించి అధికారులకు చేరవేస్తూ.. తన వంతు బాధ్యతను నిర్వహిస్తోంది.
నిత్యావసరాలు, మందులు అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్న ప్రజల కోసం కేరళ ప్రభుత్వం కన్నూర్ జిల్లాలో ఓ కాల్ సెంటర్ ఏర్పాటు చేసింది. దీంతో అక్కడి వారికి తన వంతుగా సాయం చేయడం కోసం వాలంటీర్‌గా పని చేస్తూ ప్రజల సమస్యలు తెలుసుకొని వారికి చేయూతనిస్తోంది. దీంతో ఆమె చేస్తున్న పని చూసి ఎంతో మంది యువతులు కూడా ముందుకు వస్తున్నారు. సెలబ్రెటీ అనే విషయాన్ని పక్కనపెట్టి ఆమె చేస్తున్న పనికి పలువురు అభినందిస్తున్నారు. నిఖిలా విమల్ సామాజిక కార్యక్రమాలు ఎప్పుడూ ముందే ఉంటుంది. అదే స్పూర్తితో ఇప్పుడు కూడా సేవ చేస్తోంది.
Topics: