ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ తీవ్ర అనారోగ్యంతో కాసేటి క్రితమే మరణించారు. ఆయన వయసు 54 సంవంత్సరాలు, ఆయన కొన్నిరోజులుగా విచిత్రమైన కాన్సర్ వ్యాధితో పోరాడి ఈ మధ్యే భారత్‌కు వచ్చారు. రీసెంట్‌గా ఇర్ఫాన్ ఖాన్ తల్లి సైదా బేగం ఎప్రిల్ 25 ఉదయం కన్ను మూసింది. కరోనా లాక్‌డౌన్ కారణంగా కన్నతల్లిని కడసారి చూపులకు నోచుకోలేకపోయాడు ఇర్ఫాన్ ఖాన్. ఇక తన తల్లి అంత్యక్రియలను అతను వీడియో మాధ్యమం ద్వారా వీక్షించి ఎంతో తల్లడిల్లిపోయాడు.
కన్నతల్లి కనుమూసి నాలుగైదు రోజులు కాలేదు.. అపుడే ఇర్ఫాన్ ఖాన్ మరోసారి తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రి పాలై అకాల మరణం చెందడం బాలీవుడ్‌కు తీరని లోటు. తీవ్ర అనారోగ్యంతో ఈయన ముంబాయిలోని కోకిలాబెన్ ధీరూబాయి అంబానీ హాస్పిటల్‌లో చేరారు. 54 ఏళ్ల ఇర్ఫాన్ ఖాన్‌కు డాక్లర్టు ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. డాక్టర్లు ఎంత ప్రయత్నించినపటికి ఆయన కోలుకోలేదు. ఆయన గత కొన్ని రోజులుగా న్యూరోఎండోక్రిన్ ట్యూమర్’ అనే అతిఅరుదైన క్యాన్సర్ కారణంగా లండన్‌లో చికిత్స తీసుకున్నాడు. అంతేకాదు క్యాన్సర్ నుంచి కోలుకోని రీసెంట్‌గా ‘అంగ్రేజీ మీడియం’ అనే సినిమ ాలో ముఖ్యపాత్రలో నటించారు.
Topics: