శృంగార తారగా ప్రపంచాన్ని ఏలుతున్న సన్నీ లియోన్ ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై కూడా హల్చల్ చేస్తోంది. తన పాత రంగాన్ని పూర్తిగా వదిలిపెట్టేసి చిత్రసీమలోనే ఫిక్స్ అయిన సన్నీ హీరోయిన్, స్పెషల్ రోల్స్, ఐటమ్ సాంగ్స్ ఇలా ప్రతీ ఒక్కదాన్ని టచ్ చేస్తోంది. అయితే అన్నింటిలోనూ తన ప్రత్యేకతను చాటుతూ ఫుల్ బిజీ అయ్యింది. మొదట్లో సన్నీకి కొంత వ్యతిరేకత ఎదురైనా మెల్లిమెల్లిగా వ్యవహారం సద్దుమణిగింది.ప్రస్తుతం సన్నీ లియోన్ యాడ్స్, సినిమాలు, స్పెషల్ సాంగ్స్ అంటూ రెండు చేతులా సంపాదిస్తోంది. స్టార్ హీరోయిన్‌లతో సరిసమానమైన క్రేజ్‌ను సన్నీ లియోన్ సంపాదించుకుంది.
శృంగార తారగా గుర్తింపుపొందిన సన్నీ లియోన్ చిత్ర నిర్మాతగానూ అవతారం ఎత్తేందుకు రెడీ అయింది. సొంత బ్యానర్ మొదలుపెట్టింది ఒక పక్క సినిమాలు, మరోపక్క వెబ్ సిరీస్ లతో సన్నీ బిజీగా ఉన్నప్పటికీ.. నిర్మాతగా కొత్త బాధ్యతను చేపట్టడానికి సిద్దమైంది. ఇటీవలె సన్నీ లియోన్ సొంత బ్యానర్ లో సినిమాను తెరకెక్కించనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం దేశం మొత్తం లాక్ డౌన్ విధించడంతో పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎక్కడి వారు అక్కడే ఇంట్లోనే ఉండాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలోనే సన్నీ లియోన్ సరికొత్త ప్రోగ్రామ్‌ను ప్రారంభించేసింది. లాక్డ్ అప్ విత్ సన్నీ అంటూ రోజుకో గెస్ట్‌తో లైవ్‌లోకి వస్తూ హల్చల్ చేస్తోంది.
Topics: