దక్షిణాదిలోనే కాకుండా బాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ఉన్న అందాల భామ ప్రియమణి. ప్రియమణి వివాదాలకు, రూమర్లకు దూరంగా ఉంటారు. అయితే సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్)లో అసభ్యంగా ప్రవర్తించినందుకు అతడ్ని ప్రియమణి చెంపబెబ్బ కొట్టింది అంటూ పలు వార్తుల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా దేశవ్యాప్తంగా సినీ తారలు పాల్గొన్న అలాంటి టోర్నిలో దక్షిణాది తారకు అవమానం జరిగింది అనే విధంగా కథనాలు వెలువడ్డాయి.
దీనిపై నటి ప్రియమణి వివరణ ఇచ్చారు, ఓ వ్యక్తి మొబైల్ ఫోన్ దొంగిలించి నాతో ప్రాంక్ చేస్తున్నాడు. రకరకాలుగా ఇబ్బంది పెట్టాడు. ఆ తర్వాత ఫోన్ దొంగిలించిన వ్యక్తి స్వయంగా నా హోటల్ రూంకు వచ్చి కలిశాడు. నాతో బిహేవ్ చేసిన విధానం సరిగా లేదని చెప్పాను. ఆ సంఘటన ఓ చేదు అనుభవం లాంటిదే. అయితే తాను అతడిని కొట్టానని వచ్చిన వార్తల్లో నిజం లేద అని ప్రియమణి క్లారిటీ ఇచ్చింది. ఇంతకీ తనను ఇబ్బంది పెట్టిన ఆ క్రికెటర్ పేరేంటి అన్న ప్రశ్నకు మాత్రం ప్రియమణి సమాధానం ఇవ్వలేదు.
Topics: